కో ఆప్టెక్స్ ఎగ్జిబిషన్ సేల్ ప్రారంభం
విజయవాడ(గాంధీనగర్): చేనేత కార్మికుల ఉత్పత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు ఇన్చార్జి జిల్లా పౌరసంబంధాల అధికారి ఎస్వీ మోహన్‌రావు చెప్పారు. స్థానిక ఫిలిం చాంబర్ హాలులో కో ఆప్టెక్స్ దీపావళి ప్రత్యేక ఎగ్జిబిషన్ సేల్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత ఉత్పత్తులకు సహాయ, సహకారాలు అందిస్తున్నాయన్నారు. దీపావళిని పురస్కరించుకుని తమిళనాడు హ్యాండ్లూమ్ వీవర్స్ చేనేత కార్మికులు రూపొందించిన ఉత్పత్తులను 30 శాతం ప్రత్యేక రిబేట్‌పై అందిస్తున్నామన్నారు. రీజినల్ మేనేజర్ ఎల్ శేఖర్ మాట్లాడుతూ ఎగ్జిబిషన్ సేల్‌ను ఈనెల 27వరకు నిర్వహిస్తామన్నారు. కాంచీపురం ఫ్యూర్ సిల్క్, ఆర్నీ, సాఫ్ట్ సిల్క్, తక్కువ ధరల్లో నాణ్యమైన సిల్కు చీరలు అందిస్తున్నట్లు చెప్పారు. కోయంబత్తూరు, సేలం, మధురై, కేరళ కొట్టాయంలకు చెందిన కాటన్ చీరలు, కోర శారీస్, దుప్పట్లు, టవల్స్, లుంగీలు, దోతీలు, డ్రెస్‌మెటీరియల్, డోర్‌మ్యాట్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. డిస్కౌంట్ అన్ని కో ఆప్టెక్స్ షాపులలో జనవరి 31 వరకు అందిస్తామన్నారు. కార్యక్రమంలో మేనేజర్ ఎం.జగన్నాథన్, డీఆర్ఎం కె.చంద్రశేఖర్, మార్కెటింగ్ మేనేజర్ కె.యువరాజ్, డి రమణ, ఎ.రాజేశ్వర్ పాల్గొన్నారు.