త్వరలో హేతుబద్ధీకరణపై స్పష్టత!
► సీఎంతో సమావేశం కానున్న కడియం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత రానుంది. ఈ విషయంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో చర్చించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి భావిస్తున్నారు. ఈ మేర కు సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కోరినట్లు తెలిసింది. ఒకవేళ హేతుబద్ధీకరణ, పదోన్నతులు, బదిలీలకు సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇస్తే అవే ఉంటాయి తప్ప పాఠశాలల హేతుబద్ధీకరణ ఉండదని, మూసివేత ఉండదని విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి.
రాష్ట్రంలో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ, పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలి సిందే. ఈ నేపథ్యంలో గురువారం విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్య, పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులుతో మంత్రి శ్రీహరి చర్చించారు. పదోన్నతులు, బదిలీలపై సీఎంతో చర్చించి శుక్రవారం లేదా శనివారం నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.