క్లాసిక్ జట్టు గెలుపు
జింఖానా, న్యూస్‌లైన్: హెచ్‌సీఏ కిషన్ ప్రసాద్ వన్డే నాకౌట్ టోర్నీలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో క్లాసిక్ జట్టు 13 పరుగుల తేడాతో విజయనగర్ జట్టుపై విజయం సాధించింది. తొలుత క్లాసిక్ జట్టు 216 పరుగుల వద్ద ఆలౌటైంది. బాబర్ (52) అర్ధ సెంచరీతో రాణించాడు. అనంతర ం విజయనగర్ జట్టు 203 పరుగులు చేసి ఆలౌటైంది. క్లాసిక్ జట్టు బౌలర్లు హైదర్ 4 ,యూసుఫ్ 3 వికెట్లు తీసుకున్నారు.
ఎ-ఇన్స్టిట్యూషన్ వన్డే లీగ్
ఐఏఎఫ్: 174 (దీపక్ యాదవ్ 40; రమేష్ 5/38, అక్షయ్ 3/53); నేషనల్ ఇన్సూరెన్స్: 145 (శర్మ 38).
విద్యుత్ సౌధ: 146/8 (అలీ 32, సురేష్ బాబు 31, శ్రీనివాస్ 35; విజయ్ కుమార్ 3/20, శేఖర్ 4/45); ఈసీఐఎల్: 134/9 (విజయ్ కుమార్ 34; జగన్నాథ్ 5/50).
వీఎస్టీ: 148 (ప్రియారాజ్ 69; శ్రీనివాస్ 7/58); ఐఐసీటీ: 149/5 (థామస్ 34, శ్రీనివాస్ 54).