'మారడోనా మోసగాడు'
బ్యూనోస్ ఎయిర్స్: అర్జెంటీనా సాకర్ దిగ్గజం డిగో మారడోనా మోసగాడని అతడి మాజీ భార్య క్లాడియా విల్లాఫాన్(52) ఆరోపించింది. తన కుమార్తె జియానియాతో కలిసి బుధవారం బ్యూనోస్ ఎయిర్స్ కోర్టులో హాజరైంది. తన భర్త బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులు తీయలేదని కోర్టుకు తెలిపింది.
తన బ్యాంకు అకౌంట్ నుంచి 6 లక్షల మిలియన్ డాలర్లు మాయం అయ్యాయని మారడోనా కోర్టుకు ఎక్కారు. అయితే తన డబ్బు తనకు తిరిగి కావాలని 54 ఏళ్ల మారడోనా కోర్టుకు తెలిపాడు. తాను ఎవరిపైనా నిందలు వేలయదలచుకోలేదని, ఎవరి పేర్లు బయటపెట్టాలనుకోవడం లేదని చెప్పాడు. అయితే క్లాడియా నిరపరాధి అని రుజువు చేస్తామని ఆమె తరపు న్యాయవాది తెలిపారు.
తన బంగారు ఆభరణాలను దోచుకెళ్లిందని మారడోనా అంతకుముందు తన మాజీ ప్రేయసి రోకియో ఒలివాపై ఆరోపణలు చేశాడు. తనను కావాలని మారడోనా ఇరికించాడని రోకియో పేర్కొంది.