ఒక్క సెల్ఫీ చాలు!
స్టయిలిష్ విలన్గా దూసుకెళుతున్నజగపతిబాబు ఇప్పుడు నిర్మాతగానూ మారాలనుకుంటున్నారు. తన తండ్రి స్థాపించిన జగపతి పిక్చర్స్ను పునఃప్రారం భించి మళ్లీ సినిమాలు నిర్మించ డానికి సన్నాహాలు చేస్తున్నారు. అంతే కాకుండా, సినిమా రంగం లోకి అడుగుపెట్టాలనుకునేవాళ్ల కోసం ‘క్లిక్సినీకార్ట్’ అనే వెబ్ సైట్ను ప్రారంభించారు. సోమవారం హైదరాబాద్లో దాసరి నారాయణరావు ఈ వెబ్సైట్ను ఆవిష్కరించారు. దాసరి మాట్లాడుతూ- ‘‘ సినిమాలు తీయాలనుకునే వారు, నటించాలనుకునేవారు పరిశ్రమలోకి వచ్చి మోసపోతున్నారు.
ఇకమీద ఎవరికీ ఏ శ్రమ లేకుండా జగపతిబాబు మంచి ఐడియాతో ముందుకొచ్చారు. కొత్తవారితో సినిమా తీయాలనుకునే వారికి ఈ వెబ్సైట్ ఉపయోపడుతుంది’’ అన్నారు. ‘‘మా నాన్నగారు నిర్మాతైనా, నేను సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి కష్టాలుపడ్డా. ఏ నేపథ్యం లేకుండా వచ్చిన వాళ్ల పరిస్థితి ఏమిటన్న ఆలోచనతో దీన్ని ప్రారంభించా. ఓ సెల్ఫీ తీసుకుని ఈ పోర్టల్లో రిజిస్టరైతే చాలు. రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీ’’ అని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ ఐ.టి. సెక్రటరీ జయేశ్ రంజన్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.