క్లిక్ సినీ క్రాప్ట్ సినిమా ఛాన్స్
పాత గుంటూరు : స్థానిక కొరిటెపాడులోని ఎల్వీఆర్ అండ సన్స్ క్లబ్లో క్లిక్ సినీ క్రాఫ్ట్ ఆడిషన్స్(ఎంపికలు) సోమవారం అట్టహాసంగా జరిగాయి. నవతరంలో దాగిన ప్రతిభను వెలికితీసి చిత్ర పరిశ్రమకు పరిచయం చేయాలనే తలంపుతో క్లిక్ సినీ క్రాఫ్ట్ ఆడిషన్స్‌ను ప్రారంభించిందని ప్రముఖ సంగీత దర్శకుడు శశిప్రీతమ్ తెలిపారు. సోమవారం జరిగిన ఆడిషన్స్‌లో 200 మంది ఔత్సాహికులు పాల్గొన్నారన్నారు. మరో రెండు రోజులపాటు ఆడిషన్స్‌ను నిర్వహించనున్నామని, ఆసక్తిగల యువత సద్వినియోగపరుచుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో వర్ధమాన గాయని ప్రత్యూషశర్మ, వారి బృందం సభ్యులు పర్యవేక్షించారు.