పోలెండ్‌లో 2018 వాతావరణ సదస్సు
వార్సా : 2018లో వాతావరణ మార్పు సదస్సును(యూఎన్‌సీసీసీ) పోలెండ్‌లోని కతావీజ్ నగరంలో నిర్వహిస్తామని ఐక్యరాజ్యసమితి తెలిపింది. పోలెండ్ పర్యావరణ మంత్రి జాన్ సెజిస్కో, యూఎన్‌సీసీసీ కార్యదర్శి పాట్రీసియా ఎస్పీనోసాలు గురువారం నాడిక్కడ జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
కతావీజ్ నగరం బొగ్గును అధికంగా ఉత్పత్తి చేస్తూ..యూరోప్‌లోనే అత్యంత కలుషిత ప్రాంతంగా పేరుగాంచింది. యూన్‌సీసీసీ సమావేశాలకు కతావీజ్‌ను ఎంచుకోవడంపై పర్యావరణ వేత్తలు ఆనందం వ్యక్తం చేశారు. ఐరాస నిర్ణయం వల్ల ఇక్కడ పునరుత్పాదక ఇంధనాల వాడకం పెరుగుతుందని ఆశాభావం వ్యకం చేశారు. పోలెండ్‌లో ఇంతకుముందు 2008లో పోజ్నన్, 2013లో వార్సా నగరాల్లో ఇలాంటి సదస్సులు నిర్వహించారు.