8న జిల్లాకు కేసీఆర్ రాక
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈనెల 8న జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం హో దాలో ఆయన తొలిసారి ఆదిలాబాద్‌కు రానున్నారు. ఈ మేరకు కేసీఆర్ పర్యటన ఖరారైనట్లు రాష్ట్ర అట వీశాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్రానికి చేరుకుని రోజంతా జిల్లాలోనే ఉంటారన్నారు.
బంగారు తెలంగాణ సాధించడంలో భాగంగా జిల్లా స్థితిగతులను తెలుసుకునేందుకు ఆయన స్వయంగా జిల్లా ఉన్నతాధికారులతో రోజంతా సమీక్షలు చేయనున్నారు. జిల్లాలో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, రోడ్లు, సాగునీటి రంగం వంటి అంశాలపై ఆయన శాఖలవారీగా సమీక్షించనున్నారు. అయితే సీఎం పర్యటన అధికారికంగా ఇంకా ఖరారు కావాల్సి ఉంది.