CMO Chief Secretary
-
పంచ్ ప్రసాద్‌కు ఆపరేషన్.. అండగా ఏపీ ప్రభుత్వం
జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నారు. రెగ్యులర్‌గా డయాలసిస్ చేయించుకుంటున్నా ఆరోగ్యంలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో మరోసారి ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి సీరియస్‌గా ఉందని జబర్దస్త్ కమెడియన్ నూకరాజు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. (ఇది చదవండి: విషమంగా పంచ్ ప్రసాద్ ఆరోగ్యం.. ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చు!) వీలైనంత త్వరగా అతడికి ఆపరేషన్ చేయాలని, అందుకు చాలా ఖర్చవుతుందని, దాతలు సాయం చేయాలని కోరాడు. పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియో రిలీజ్ చేశారు. పంచ్ ప్రసాద్‌కు ఆపరేషన్.. అండగా ఏపీ ప్రభుత్వం పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు మంత్రి ఆర్కే రోజా. ఈ మేరకు స్పందించిన సీఎం జగన్.. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పంచ్ ప్రసాద్‌కి వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. యశోద ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న పంచ్ ప్రసాద్‌కి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఏపీ ప్రభుత్వం వైద్యం చేయిస్తోంది. అంతకుముందు ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధి కార్యక్రమాలన్నీ పర్యవేక్షించే డాక్టర్ మామిడి హరికృష్ణకు ఒక నెటిజన్ ట్యాగ్ చేశారు. దీంతో ఈ విషయంపై సీఎం ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ హరికృష్ణ స్పందించారు. ఇప్పటికే తమ టీం పంచ్ ప్రసాద్ కుటుంబసభ్యులతో టచ్‌లో ఉందని వెల్లడించారు. వారితో లెటర్ ఆఫ్ క్రెడిట్ అప్లై చేసేందుకు ప్రయత్నాలు చేసేందుకు కృషి చేస్తున్నామని ట్వీట్ చేశారు. డాక్యుమెంట్లను పరిశీలించి వీలైనంత త్వరగా క్లియర్ చేసే ప్రక్రియ మొదలవుతుందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. దీంతో మంచి ప్రసాద్‌కి త్వరలోనే సర్జరీ జరిగి ఆయన ఆరోగ్యం కుదుటపడాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. (ఇది చదవండి: రెండో పెళ్లికి రెడీ అయిన బుల్లితెర నటి తండ్రి) My team is following up with the family and guiding them in LOC application process. We will LOC under CMRF for renal transplantation as soon as we complete the documents verification.#YSJaganCares https://t.co/CAkeihv0VR — Dr Hari Krishna (@HariKrishnaCMO) June 8, 2023 -
సీఎం ఆఫీసులో కరోనా కలకలం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంఓ)లో కరోనా కలకలం రేపింది. కొత్త సచివాలయ భవన సముదాయం నిర్మాణం కోసం దాదాపు కొన్ని నెలల కింద సచివాలయాన్ని ఖాళీ చేయడంతో సీఎంవోను బేగంపేటలోని మెట్రోరైలు భవనానికి తరలించిన విషయం తెలిసిందే. సీఎంవోలో సీఎం ముఖ్యకార్యదర్శి స్థాయి అధికారి పేషీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇటీవలే మహారాష్ట్ర నుంచి ఆ ఉద్యోగి కుమారుడు హైదరాబాద్‌కు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. కుమారుడి ద్వారా సీఎంవో ఉద్యోగికి వైరస్ సోకిందని నిర్ధారించారు. ఈ క్రమంలో శనివారం సీఎంవో కార్యాలయాన్ని శానిటైజ్ చేసి భవనాన్ని సీజ్ చేశారు. సీఎంవో ఉద్యోగులు ఎవరూ కార్యాలయానికి రావద్దని ఆదేశించారు. సీఎంవోకు ఎవరూ రావొద్దని అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కొద్దిరోజుల పాటు సీఎంవో బంద్ కానుంది. సీఎంవోలో పనిచేస్తున్న దాదాపు 30 మంది సిబ్బంది ఉద్యోగుల శాంపిళ్లను చెస్ట్ ఆస్పత్రి వైద్య సిబ్బంది సేకరించారు. ఒకటి రెండ్రోజుల్లో వీరికి సంబంధించిన రిజల్ట్స్ రానున్నాయి. సీఎంవోలో పనిచేస్తున్న వారిలో సీనియర్ సిటిజన్స్ అధికంగా ఉన్నారు. రిటైర్డు అధికారులూ ఉన్నత పదవుల్లో కొనసాగుతున్నారు. దీంతో తీవ్ర ఆందోళన నెలకొంది. రిటైర్డు సీఎస్, ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయం నుంచి విధులు నిర్వహిస్తున్నారు. బీఆర్కేఆర్లో కూడా.. రాష్ట్ర తాత్కాలిక సచివాలయం బీఆర్కేఆర్కు కూడా కరోనా సెగ తాకింది. రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి సమీప బంధువు శుక్రవారం రాత్రి గాంధీలో కరోనాతో మరణించారు. దీంతో ఆ ఉద్యోగికి సంబంధించిన కుటుంబ సభ్యులందరి నుంచి శాంపిల్స్ తీసుకుని పరీక్షల కోసం పంపించారు. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ కార్యాలయంతో పాటు బీఆర్కేఆర్ భవనాన్ని మరోసారి శానిటైజ్ చేయించారు. బీఆర్కేఆర్ నుంచే పనిచేస్తున్న రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలోని ఓ మహిళ అధికారి కుమారుడు ఉస్మానియాలో వైద్యుడిగా పనిచేస్తున్నారు. ఆయనకు సైతం 4 రోజుల కింద కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆ ఉద్యోగిని హోం క్వారంటైన్లో ఉన్నారు. -
సిఎంఓ ముఖ్యకార్యదర్శిగా ఎస్.నర్సింగరావు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ (సిఎంఓ) ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్.నర్సింగరావు బాధ్యతలు చేపట్టారు. 1986 ఆంధ్ర ప్రదేశ్ బ్యాచ్‌కు చెందిన నర్సింగ రావు గతంలో సింగరేణి కాలరీస్ కంపెనీకి చైర్మన్‌గా ఉన్నారు. ఆ తరువాత ఆయన కోల్ ఇండియా సీఎండీగా ఉండేవారు. ప్రస్తుతం ఆయనను తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ చేశారు. దాంతో ఆయనను సిఎంఓ ముఖ్యకార్యదర్శిగా నియమించారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ఏ.బాబును హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌గా ఎం.జగన్మోహన్ను నియమించారు.