సీఎం నివాసంపై రెండ్రోజుల్లో నిర్ణయం
సాక్షి, విజయవాడ బ్యూరో: విజయవాడ సమీపంలో సీఎం నివాసంపై ప్రభుత్వం రెండ్రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది. అన్నివిధాలా అనువైన భవనాన్ని అధికారులు ఎంపిక చేయనున్నారు. తాడేపల్లి మండలం ఉండవల్లి కరకట్ట పక్కనేఉన్న పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ అతిథి గృహాన్ని రెండు రోజులక్రితం పరిశీలించిన కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారులు సీఎం నివాసానికి అనువైనదిగా ప్రతిపాదించారు. అయితే నదీ పరిరక్షణ చట్టం నిబంధనలకు విరుద్ధంగా ఈ భవనాన్ని నిర్మించారనే అంశం తెరపైకి రావడంతో పునరాలోచనలో పడ్డారు.
మరోవైపు విజయవాడలోనే జనావాసాల మధ్య అనువైన ఇంటిని సీఎం నివాసం కోసం ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గురువారం విజయవాడ వచ్చిన పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈ అంశంపై మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని సీఎం చె ప్పారన్నారు.
గుంటూరు, విజయవాడ నడుమ ఉద్యోగుల నివాసం
హైదరాబాద్ నుంచి విజయవాడ, గుంటూరు తరలి వచ్చే ప్రభుత్వ ఉద్యోగులకు ఐదో నంబరు జాతీయ రహదారికి పక్కనే ఉన్న రెయిన్పార్కు అపార్ట్మెంట్లను కేటాయించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది.
ముస్లింలకు చంద్రబాబు రంజాన్ శుభాకాంక్షలు
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముస్లింలకు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటనలో విడుదలైంది.