సూర్య సినిమాకు కలెక్షన్ల సునామీ
సూర్య లేటెస్ట్ మూవీ '24' బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఓవర్ సీస్ లో రికార్డు వసూళ్లు రాబడుతోంది. అమెరికా, కెనడాలో భారీగా కలెక్షన్లు కొల్లగొడుతోంది. వారం రోజుల్లో మొత్తం రూ. 8.22 కోట్లు వసూలు చేసింది. గురువారం నుంచి మంగళవారం వరకు అమెరికాలో 1,157,926 డాలర్లు, కెనడాలో 76,627 డాలర్లు వసూలు చేసిందని సినీ విమర్శకుడు, బిజినెస్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు.
'టైమ్ ట్రావెల్' అనే వినూత్న అంశంతో 'సైన్స్-ఫిక్షన్'గా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సూర్య విలక్షణ నటన, దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వ ప్రతిభ ఈ సినిమాను హిట్ జాబితాలో చేర్చింది. టాలీవుడ్, కోడీవుడ్ లోనూ మొదటి వారంలో '24' భారీ వసూళ్లు సాధించినట్టు తెలుస్తోంది.