Collective effort
-
సమష్టి కృషి ఫలితమే 2014లో ఐదు విజయాలు
సూళ్లూరుపేట : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2014లో గతంలో ఎన్నడూ లేని విధంగా సమష్టి కృషితో ఐదు ప్రయోగాలు చేసి విజయాలను సాధించగలిగామని షార్ డెరైక్టర్ డాక్టర్ పద్మశ్రీ ఎంవైఎస్ ప్రసాద్ అన్నారు. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని అంతరిక్ష కేంద్రీయ విద్యాలయం మైదానంలో సోమవారం 66వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని షార్ డెరైక్టర్ మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. అనంతరం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాల ఇన్చార్జి కమాండెంట్ ధనంజయ శుక్లా ఆధ్వర్యంలో కవాతు నిర్వహించి సైనిక వందనాన్ని సమర్పించారు. ఈ కవాతులో ప్రతిభ కనపరిచిన భద్రతా సిబ్బందికి జ్ఞాపికలను అందించారు. ఆ తరువాత ఆయన మాట్లాడుతూ షార్ చరిత్రలో 2014 సంవత్సరం మరిచిపోలేనిదని చెప్పారు. మూడు పీఎస్ఎల్వీ రాకెట్లు, ఒక జీఎస్ఎల్వీ రాకెట్, జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగాలతో అన్ని విజయాలను సాధిం చామని చెప్పారు. ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాల వల్ల మానవాళికి మంచి ఫలితాలను అందిస్తున్నందు కు గర్వ కారణంగా ఉందన్నారు. భవిష్యత్‌లో మానవాళికి మరింత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. భవిష్యత్‌లో భారీ ప్రయోగాలే లక్ష్యంగా పనిచేస్తున్నామని, అందరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ సందర్భంగా దేశ రక్షణ, షార్ కేంద్రం రక్షణకు సంబంధించిన 30 మంది భద్రతా దళం కరాటే, మార్షల్ ఆర్ట్స్, కుంగ్‌ఫూ ప్రదర్శనలు ఇచ్చారు. అంతరిక్ష కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతో అలరించాయి. అన్ని కాలనీల్లో మువ్వన్నెల జెండా కేఆర్పీ కాలనీ (పులికాట్ నగర్) స్కూల్లో షార్ అసోసియేట్ డెరైక్టర్ వీ శేషగిరిరావు, డీఓఎస్ కాలనీ (పినాకినీ నగర్) స్కూల్లో రేంజ్ ఆపరేషన్ డెరైక్టర్ ఎస్వీ సుబ్బారావు, శ్రీహరికోట జిల్లా పరిషత్ హైస్కూల్లో డిప్యూటీ డెరైక్టర్ టీ సుబ్బారావు, శ్రీహరికోట ప్రాథమిక పాఠశాలలో డిప్యూటీ డెరైక్టర్ ఎంబీఎన్ మూర్తి, శబరికాలనీలో డాక్టర్ రబ్బాన్నీ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. షార్ డెరైక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ ఆట, పాటల పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పీఆర్వోలు పరచూరి విజయసారథి, విశ్వనాథశర్మ తదితరులు పాల్గొన్నారు. -
సమష్టి కృషితోనే ప్రమాదాల నివారణ
కర్నూలు(రాజ్‌విహార్): రోడ్డు ప్రమాదాల నివారణకు సమష్టి కృషి అవసరం అని జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ అన్నారు. 26వ రోడ్డు భద్రతా వారోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం స్థానిక కొత్త బస్టాండ్‌లోని కర్నూలు-2 డిపో గ్యారేజీలో నిర్వహించారు. ఎస్పీ రవికృష్ణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బస్సులు నడిపేటప్పుడు ఏకాగ్రత చాలా అవసరం అన్నారు. విధులకు హాజరయ్యే ముందు తగిన విశ్రాంతి తీసుకుంటే మానసిక ఉల్లాసం ఉంటుందని సూచించారు. విధుల్లో ఉన్న ప్రతి డ్రైవరు తన బస్సులో ఉన్న ప్రయాణికుల సంక్షేమాన్ని మరవరాదన్నారు. తనపై 50- 60 మంది ప్రాణాలు ఆధారపడి ఉన్నాయన్న విషయాన్ని గుర్తించుకోవాలని తెలియజేశారు. ఆర్టీఓ సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. అజాగ్రత్త కారణంగా ప్రమాదాలు ఏర్పడితే జీవితంలో విషాదం మిగులుతుందన్నారు. సెల్ఫోన్లో మాట్లాడుతూ బస్సులు నడపడం, అధిక వేగం, ఓవర్‌టెక్ చేడయం ప్రమాదాలకు సూచికలని వివరించారు. ఆర్టీసీ కడప జోన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టరు ఎ. కోటేశ్వరరావు మాట్లాడుతూ డ్రైవర్లు, కార్మికులు మద్యపానం, గుట్కా వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎం కృష్ణమోహన్, డిప్యూటి చీఫ్ మెకానికల్ ఇంజినీర్ శ్రీనివాసులు, డిప్యూటి చీఫ్ ట్రాఫిక్ మేనేజరు టి.వి. రామం, కర్నూలు-1, 2డిపోల మేనేజర్లు మనోహర్, గౌతం చటర్జీ, అసిస్టెంట్ మేనేజర్లు వెంకటయ్య, చలపతి, సుబ్రహ్మణ్యం, కార్మికులు పాల్గొన్నారు. -
ఇంధన పొదుపులో రీజియన్ ముందంజ
హన్మకొండ : ఇంధన పొదుపులో ఆర్టీసీ వరంగల్ రీజియన్ ఇతర రీజియన్లకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇక్కడి అధికారుల కృషితో వరంగల్ రీజియన్ ఇంధన ఆదాలో రికార్డులు సాధిస్తోంది. నష్టాల నుంచి ఆర్టీసీని గట్టెక్కించేం దుకు ఖర్చులు తగ్గించడంలో భాగంగా రీజి యన్ అధికారులు ఇంధన పొదుపు, టైర్ల మ న్నిక, టైర్ల జీవితకాలం పెంపుపై దృష్టి సారిం చారు. ఈ మేరకు డీజిల్ పొదుపుపై డ్రైవర్లకు నిరంతర శిక్షణ ఇస్తూ ఎలా బస్సు నడిపితే డీజి ల్ ఆదా అవుతుందో వివరిస్తున్నారు. ఈ శిక్షణ ఫలితంగా 2011-2012 ఆర్థిక సంవత్సరంలో 5.49 కేఎంపీఎల్‌తో రాష్ట్రంలోనే ప్రథమ స్థా నం, 2012-2013 ఆర్థిక సంవత్సరంలో 4.9 కేఎంపీఎల్‌తో రాష్ట్రంలో ద్వితీయ స్థానం, 2013-2014లో 5.50 కేఎంపీఎల్‌తో ద్వితీయ స్థానంలో నిలిచిన ఆర్టీసీ వరంగల్ రీజియన్ ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు 5.55 కేఎంపీఎల్ సాధించి అగ్రస్థానంలో దూసుకువెళ్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు తెలంగాణ, అంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే 5.55 కేఎంపీఎల్‌తో ప్రథమ స్థానంతో ముందు నిలుస్తోందని అధికారులు వెల్లడించారు. కాగా, ఆర్టీసీ వినియోగిస్తున్న బస్సుల్లో గరుడ బస్సులు డీజిల్ అతి ఎక్కువగా తీసుకుంటుండగా.. ఇందులో కూ డా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో 4.24 కేఎంపీఎల్‌తో వరంగల్ రీజి యన్ అగ్రస్థానంలో నిలిచింది. ఆర్టీసీ వరంగల్ రీజియన్‌లో 763 బస్సులు ప్రతి రోజుకు మూడు లక్షల కిలోమీటర్లు తిరుగుతుండగా.. అధికారుల సూచనలు, ప్రోత్సాహంతో కార్మికులు ఇంధన పొదుపు ద్వారా ఏటా రూ.50లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చులు తగ్గిస్తూ ఆదా చేస్తున్నారు. సమష్టి కృషితోనే ఈ విజయం... సమష్టి కృషితో ఇంధన పొదుపులో సంస్థలోనే ప్రథమ స్థానంలో నిలవగలుగుతున్నాం. రీజినల్ మేనేజర్ ఇ.యాదగిరి సూచనలు.. డ్రైవర్లు, మెకానిక్‌ల సహకారంతో నిరంతర శిక్షణ ద్వారా ఇంధన పొదుపును చేయగలుగుతున్నాం. అలాగే, పొదుపులో ముందు నిలుస్తున్న డ్రైవర్లకు ప్రోత్సాహకాలు అందించి ప్రోత్సహిస్తున్నాం. డీజిల్ పొదుపు ద్వారా ఖర్చులు త గ్గిస్తూ సంస్థకు పరోక్షంగా ఆదాయాన్ని సమకూర్చుతున్నాం. - అంచూరి శ్రీధర్, డిప్యూటీ సీఎంఈ, వరంగల్ రీజియన్ -
సమష్టి కృషితోనే వేడుకలు విజయవంతం
కర్నూలు(అగ్రికల్చర్): సమష్టి కృషితోనే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఊహించిన దానికంటే ఎక్కువగా విజయవంతం అయ్యాయని.. ముఖ్యమంత్రి కూడా నిర్వహణ పట్ల సంతోషం వ్యక్తం చేశారని జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ సీఎం చంద్రబాబునాయుడు జిల్లా అభివృద్ధికి ఇచ్చిన హామీలపై నెల రోజుల్లో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపుతామన్నారు. ఇందు కోసం రోజుకు 20 గంటల పాటు శ్రమిస్తానన్నారు. జిల్లాలో సమర్థులైన అధికారులు ఉన్నారని.. వారి సహకారంతో ముఖ్యమంత్రి హామీలకు ఓ రూపును తీసుకొస్తానన్నారు. కర్నూలు ప్రాంతంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు క్లియరెన్స్ లభించిందన్నారు. ఫ్యాక్టరీకి 189 ఎకరాల భూమి అవసరం కాగా.. నిధుల లేమితో భూసేకరణ నిలిచిపోయిందన్నారు. రూ.12 కోట్లు అవసరమని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారన్నారు. ‘వెంటనే పనులు ప్రారంభించండి.. నిధులు త్వరలోనే ఇస్తా’నని హామీ ఇచ్చారన్నారు. తుంగభద్ర నదిపై నిర్మించిన ఎత్తిపోతల పథకాల పనులు పూర్తయినా విద్యుత్ సమస్యలతో ప్రారంభానికి నోచుకోలేదని సీఎంకు వివరించగా ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారన్నారు. జిల్లాలో ఎలాంటి పరిశ్రమలు స్థాపించవచ్చు.. ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రితో చర్చించగా వాటితో పాటు మరిన్ని వరాలు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. స్వాతంత్య్ర వేడుకల నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం మరువలేనిదన్నారు.