ముగ్గురు బాక్సర్లకు షోకాజ్ నోటీస్
న్యూఢిల్లీ: ప్రపంచ చాంపియన్‌షిప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టుపై ఆరోపణలు చేసిన ముగ్గురు బాక్సర్లకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ట్రయల్స్‌లో కోచ్‌లు, సెలక్షన్ కమిటీ కుమ్మక్కై జట్టు ఎంపికను ప్రకటించారని బాక్సర్లు దినేశ్ కుమార్, దిల్బాగ్ సింగ్, ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే.
దీంతో ఈ ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు భారత బాక్సింగ్ సమాఖ్య ముగ్గురు సభ్యులతో క్రమశిక్షణ కమిటీని నియమించింది. మంగళవారం సమావేశమైన ఈ కమిటీ బాక్సర్లకు నోటీసులు జారీ చేస్తూ ఈనెల 15లోగా సమాధానమివ్వాలని ఆదేశిం చింది. జట్టు గురించి ఆరోపణలు చేయడం శిక్షార్హమని, వీటిని నిరూపించకుంటే కఠిన శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐబీఎఫ్ అధ్యక్షుడు మటోరియా అన్నారు.