పోరాడి ఓడిన భారత్
కామన్వెల్త్ హాకీ
4-2తో ఆస్ట్రేలియా విజయం
గ్లాస్గో: వరుస విజయాలతో ఊపుమీదున్న భారత హాకీ జట్టుకు కామన్వెల్త్ గేమ్స్‌లో ఆస్ట్రేలియా అడ్డుకట్ట వేసింది. మంగళవారం జరిగిన ప్రిలిమినరీ మ్యాచ్‌లో భారత్ 2-4తో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. రూపిందర్ సింగ్ (34వ ని.), రమన్‌దీప్ సింగ్ (48వ ని.)లు భారత్‌కు గోల్స్ అందిస్తే... క్రిస్ సిరిల్లో (14, 49వ ని.), సిమోన్ ఆర్చర్డ్ (16వ ని.), జాకబ్ వాటెన్ (26వ ని.)లు ఆసీస్ తరఫున గోల్స్ చేశారు.
బ్యాడ్మింటన్: పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో గురుసాయిదత్ 21-5, 21-12తో బి లీ (ఐల్ ఆఫ్ మాన్)పై; కిడాంబి శ్రీకాంత్ 21-3, 21-4తో డుయాని మార్చ్ (సెయింట్ హలెనా)పై గెలిచి శుభారంభం చేశారు.
బాక్సింగ్: పురుషుల లైట్ వెల్టర్ (64 కేజీల) క్వార్టర్ఫైనల్లో భారత బాక్సర్ మనోజ్ కుమార్ నిరాశపర్చాడు. 0-3 (27-30, 27-30, 27-30)తో శామ్యూల్ మాక్స్వెల్ (ఇంగ్లండ్)చేతిలో ఓడాడు. మహిళల లైట్ వెయిట్ (50-60 కేజీలు) ప్రిక్వార్టర్స్‌లో లశిరామ్ దేవి 3-0 (20-18, 20-18, 20-18)తో ఒబారెహ్ (నైజీరియా)పై గెలిచి క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది.
లాన్ బౌల్స్: మహిళల పెయిర్స్ సెక్షన్-బి రౌండ్-2 మ్యాచ్‌లో భారత్ 20-12తో కెన్యాపై గెలిచి రౌండ్-3 మ్యాచ్‌లో 11-24తో న్యూజిలాండ్ చేతిలో ఓడింది. ట్రిపుల్స్ సెక్షన్-ఎ, రౌండ్-3లో భారత్ 10-8తో ఆస్ట్రేలియాపై నెగ్గింది. పురుషుల ఫోర్స్ సెక్షన్-బి, రౌండ్-3 మ్యాచ్‌లో భారత్ 17-12తో నమీబియాను ఓడించింది. పురుషుల సింగిల్స్ సెక్షన్-బి, రౌండ్-3 మ్యాచ్‌లో బహదూర్ 10-21తో రెయాన్ బెస్టర్ (కెనడా) చేతిలో ఓడాడు.
స్క్వాష్: పురుషుల డబుల్స్ పూల్-జీలో సౌరవ్ ఘోశల్-హరీందర్ పాల్ సంధు 9-11, 11-3, 11-2తో జెర్విస్-బ్లెయిర్ (కెమాన్ ఐలాండ్)పై గెలిచి; 0-2తో వేల్స్ చేతిలో ఓడింది. మిక్స్డ్ డబుల్స్‌లో సౌరవ్-దీపికా పల్లికల్ 11-3, 11-4తో రవీందు లక్సిరి-నడుని గుణవర్ధనే (శ్రీలంక)పై గెలిచారు.
అథ్లెటిక్స్: హ్యామర్ త్రోలో నారాయణ్ సింగ్ చంద్రోదయ ఫైనల్ రౌండ్‌కు చేరినా ఐదో స్థానంలో నిలిచి నిరాశపరిచాడు. క్వాలిఫికేషన్లో ఆరో స్థానంలో నిలిచి కమల్‌ప్రీత్ సింగ్ ఫైనల్స్‌కు దూరమైంది. షాట్‌పుట్టర్ ఓమ్ ప్రకాశ్ ఫైనల్లో ఆరో స్థానంలో నిలిచాడు.