కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్టు ప్రారంభం
హైదరాబాద్: కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్టును హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గురువారం ఉదయం మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని మొత్తం ఆరు ప్రాంతాల్లో 60 కెమెరాలు ఏర్పాటయ్యాయి. ముందుగా ఉమానగర్‌లో ఏర్పాటు చేసిన 15 కెమెరాలను సీపీ మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. వైట్‌హౌస్ ప్రాంతంలో 10, లైఫ్ స్టయిల్ భవనంలో 15, హెచ్‌టీసీ సాఫ్ట్వేర్ సంస్థలో 4, కుందన్‌బాగ్‌లో 6, మెథడిస్ట్ కాలనీలో పది చొప్పున సీసీ కెమెరాలు పనిచేయనున్నాయి. రూ.43 లక్షల ఖర్చుతో ఈ కెమెరాలను ఏర్పాటు చేశారు.