కానుకగా.. ఉపయుక్తంగా...!
ట్రావెల్ గేర్
పర్యటనలు ఎక్కువగా చేసే బంధువులు, మిత్రులు ఉంటే వారికి ఏదైనా మంచి కానుక ఇవ్వాలనుకుంటారు. కానీ, సమయానికి ఏదీ మైండ్‌కు తట్టదు. ట్రావెలర్స్‌కు ఉపయోగపడే కొన్ని వస్తువులపై దృష్టిపెడితే అద్భుతమైన కానుకలను అందించవచ్చు. వారి జ్ఞాపకాలలో మీరు పదిలంగా నిలిచిపోవచ్చు. మీ కానుకల జాబితాలో వీటిని చేర్చండి...
కంపాస్ నెక్లెస్
వెంట తీసుకెళ్లాల్సిన వస్తువుల జాబితాలో ‘దిక్సూచి’ గురించి అంతగా ఎవరూ పట్టించుకోరు. కానీ, తూర్పు - పడమర, ఉత్తర - దక్షిణ దిక్కులను సూచించే దిక్సూచి వెంట ఉంటే ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అయితే, ఇతర వస్తువులతో పాటు దిక్సూచినీ కలిపి ప్యాక్ చేస్తే ఎక్కడైనా పడిపోయే అవకాశాలు ఎక్కువ. అదే గొలుసులా ఉండే ఈ దిక్సూచి ఉంటే మెడలో వేసుకోవచ్చు. స్టైల్‌గానూ, ఉపయుక్తంగానూ ఉంటుంది. మన దగ్గరి వారి జ్ఞాపకంగా ప్రేమను వ్యక్తం చేయడంలో ముందుంటుంది. ఆప్తుల్లో ట్రావెలర్స్ ఉంటే వారిని ఆశ్చర్యపరిచేలా ఈ కానుకను అందజేయవచ్చు. కంపాస్‌ను వెండి, బంగారు, స్టీల్ లోహాల గొలుసు డిజైన్లలో లాకెట్లాగానూ ఉపయోగించవచ్చు.
పర్యావరణ హితం
బామ్మల నాటి కాలంలో దగ్గరి విహార ప్రదేశాలకు వెళ్లాలంటే చెక్క, చెట్ల వే ళ్లతో అల్లిన బుట్టలలో కావల్సిన పదార్థాలను సర్దుకుని వెంట తీసుకెళ్లేవారు. ప్లాస్టిక్ మయం అయిపోయిన ఈ రోజుల్లో తేలికగా ఉండేలా కలపతో తయారైన ప్లేట్లు, స్పూన్లు, అందమైన అల్లిక గల బుట్ట.. వంటివన్నీ విడి విడిగా సేకరించి ఒక సెట్ రూపంలో కానుకగా ఇస్తే ఎంతో ఉపయుక్తంగానూ, విభిన్నంగా
ఉంటుంది.