Compensation payment
-
ఆ కుటుంబానికి రూ.7.64 కోట్లివ్వండి
న్యూఢిల్లీ: 2010లో మంగళూరులో చోటుచేసుకున్న విమాన ప్రమాదంలో మృతి చెందిన ప్రయాణికుడి కుటుంబానికి రూ.7.64 కోట్ల మొత్తాన్ని పరిహారంగా చెల్లించాలని ఎయిరిండియాను సుప్రీంకోర్టు ఆదేశించింది. దుబాయ్ నుంచి 166 మంది ప్రయాణికులతో వచ్చిన ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురికాగా 158 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో యూఏఈకి చెందిన ఓ సంస్థ రీజినల్ డైరెక్టర్ మహేంద్ర కొడ్కనీ(45) ఉన్నారు. కొడ్కనీ కుటుంబానికి రూ.7.35 కోట్లు పరిహారంగా చెల్లించాలని వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్(ఎన్సీడీఆర్సీ) అప్పట్లో ఎయిరిండియాను ఆదేశించింది. వివిధ కారణాలు చూపుతూ ఎయిరిండియా ఆ మొత్తాన్ని చెల్లించలేదు. దీంతో కొడ్కనీ కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను గురువారం కోర్టు విచారించింది. ‘ఒక సంస్థ తమ ఉద్యోగుల ఆదాయాన్ని అనేక కారణాలతో వేర్వేరు కేటగిరీల కింద విభజించవచ్చు. అయితే, ఆ ఉద్యోగికున్న స్థాయి ఆధారంగా అతని ఆదాయాన్ని అంచనావేయాలి. అతని మరణంతో సంభవించిన నష్టాన్ని నిర్ణయించేటప్పుడు అతని అర్హతలను పరిగణనలోకి తీసుకోవాలి’అని పేర్కొంది. ఎన్సీడీఆర్సీ పేర్కొన్న రూ.7.35 కోట్ల నష్టపరిహారంలో ఇప్పటి వరకు చెల్లించని మొత్తానికి ఏడాదికి 9 శాతం వడ్డీ కలిపి చెల్లించాలని పేర్కొంది. ఒక వేళ అంతకంటే ఎక్కువగా చెల్లించినా పిటిషన్‌దారుల నుంచి రాబట్టేందుకు వీలు లేదని ఎయిరిండియాకు కోర్టు స్పష్టం చేసింది. -
ప్రయాణికులకు ఒక్కొక్కరికి రూ.250 చెల్లిస్తాం..
లక్నో: దేశంలోనే మొదటి ప్రైవేటు రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించినప్పుడు ఒక వేళ ఏదైనా కారణంతో రైలు ఆలస్యమైతే అందుకు పరిహారం చెల్లిస్తామని ఐఆర్సీటీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇచ్చిన మాటకు కట్టుబడిన ఐఆర్సీటీసీ శనివారం తేజస్ ఎక్స్‌ప్రెస్ రెండు గంటలు ఆలస్యం నడవడంతో అందులో ప్రయాణించిన ప్రయాణికులకు ఒక్కొక్కరికి రూ.250 చొప్పున చెల్లిస్తామని ప్రకటించింది. శనివారం రైలులో ప్రయాణించిన ప్రయాణికులందరి ఫోన్లకు ఒక వెబ్ లింక్‌ను సందేశం ద్వారా పంపించామని, ఆ లింక్ ద్వారా ప్రయాణికులు పరిహారాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చని ఐఆర్సీటీసీ చీఫ్ రీజనల్ మేనేజర్ అశ్విని శ్రీవాస్తవ తెలిపారు. శనివారం లక్నో నుంచి ఢిల్లీకి రెండు గంటలు ఆలస్యంగా బయల్దేరిన తేజస్ ఎక్స్‌ప్రెస్, తిరుగు ప్రయాణంలోనూ రెండు గంటలు ఆలస్యంగా నడిచింది. లక్నో నుంచి ఢిల్లీకి వెళ్లేటప్పుడు 451 మంది, తిరుగు ప్రయాణంలో 500 మంది ప్రయాణికులు ప్రయాణించారు. రైలు ఆలస్యమైనందుకు అందులోని ప్రయాణికులకు పరిహారం అందించడం దేశంలో ఇదే మొదటిసారి. -
కొత్త చట్టం కింద పరిహారం ఇవ్వండి
రెవెన్యూ అధికారులకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని విశ్వేశ్వరయ్య విగ్రహం వద్ద నుంచి ద్వారకా హోటల్ వరకు రహదారి విస్తరణ కోసం చేపట్టిన భూ సేకరణకు పరిహారం చెల్లింపు ఉత్తర్వులు జారీ చేసి, ఆ మొత్తాన్ని సకాలంలో జమ చేయకుంటే బాధితులకు 2013 కొత్త భూసేకరణ చట్టం కింద పరిహారం చెల్లించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. పరిహారం జమ చేయని పక్షంలో పాత భూ సేకరణ చట్టం కింద జారీ చేసిన ప్రొసీడింగ్స్ రద్దైనట్లేనని తేల్చి చెప్పింది. ఇప్పటికే భూమిని సేకరించి అందులో రహదారిని ఏర్పాటు చేసినందున పిటిషనర్‌కు కొత్త భూసేకరణ చట్టం కింద పరిహారాన్ని మూడు నెలల్లో చెల్లించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ఇటీవల తీర్పు వెలువరించారు. ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య విగ్రహం నుంచి లక్డీకాపూల్ ద్వారకా హోటల్ వరకు రోడ్డు విస్తరణ నిమిత్తం అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రాంప్రకాశ్ అగర్వాల్ అనే వ్యక్తికి చెందిన స్థలాన్ని, భవనాన్ని కూడా సేకరించాలని నిర్ణయించారు. పరిహారం చెల్లింపునకు 1999లో ఉత్తర్వులు కూడా జారీ చేశారు. తరువాత ఈ వ్యవహారం పలు వివాదాల నేపథ్యంలో సివిల్ కోర్టుకు చేరింది. అయితే అధికారులు మాత్రం చెల్లించాలని నిర్ణయించిన పరిహార మొత్తాన్ని కోర్టులో డిపాజిట్ చేయలేదు. వివాదం సమసిన తరువాత అధికారులు పాత చట్టం ప్రకారం పరిహారం చెల్లించేందుకు సిద్ధం కాగా, అందుకు అగర్వాల్ నిరాకరిస్తూ తనకు 2013 కొత్త భూ సేకరణ చట్టం కింద పరిహారం చెల్లించేలా అధికారులను ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని ఇటీవల జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు విచారించారు. -
పరిహారం చెల్లింపులోనూ రాజకీయమా?
సీఎంపై టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి ధ్వజం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం చెల్లించే విషయంలోనూ సీఎం కేసీఆర్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ధ్వజమెత్తారు. రైతు రుణాలను రూ.లక్ష వరకూ ఒకేసారి రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర టీడీపీ నేతలు ఎల్.రమణ, రేవంత్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, గరికపాటి మోహన్‌రావు తదితరులు ఆదివారం ఎర్రబెల్లి నివాసంలో భేటీ అయ్యారు. అనంతరం ఎర్రబెల్లి విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై 22వ తేదీన కేంద్ర వ్యవసాయ మంత్రిని కలవనున్నామని చెప్పారు.