ఓవరాల్ చాంపియన్ లేపాక్షి
లేపాక్షి : అనంతపురం జిల్లా లేపాక్షి మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అకడమిక్ 2016 పోటీలు గురువారం ముగిశాయి. కార్యక్రమానికి ప్రిన్సిపల్ వాదిరాజు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా బీసీ కార్పొరేషన్ చైర్మన్ రంగనాయకులు, ఎంపీపీ హనోక్ హాజరయ్యారు. రంగనాయకులు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న మేధాశక్తిని వెలికి తీయడానికి రాష్ట్ర వ్యాప్తంగా పోటీలు నిర్వహించడం గర్వించదగ్గ విషయమన్నారు. పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా 29 పాఠశాలలు పాల్గొనగా 19 స్కూళ్లకు సంబంధించిన విద్యార్థులు విజేతలై 33 33 బహుమతులను దక్కించుకున్నారు. ఇందులో లేపాక్షి గురుకుల పాఠశాల విద్యార్థులు ఆరు బహుమతులను సాధించి ఓవరాల్ చాంపియన్గా నిలిచారు.
బహుమతులు అందుకున్న పాఠశాలల వివరాలు
టెక్కలి (ఒకటి), అంపోలు (3), నెలమర్ల (2), సింహాచలం (2), కాకినాడ (1), నరసాపురం (1), మార్కాపురం (1), దొరవారిసత్రం (1), సత్యవేడు (1), సదుం (1), ఉదయమాణిక్యం (2), కలికిరి (1), పీలేరు (1), టేకులోడు (2), లేపాక్షి (6), పేరూరు (1), నందలూరు (2), అరేకల్ (1), నెరవాడ పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థులు విజేతలుగా నిలిచారు. ఈ సందర్బంగా ఆయా పాఠశాలల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులను సత్కరించారు.