ముగిసిన ఎక్సైజ్ క్రీడా పోటీలు
అనంతపురం సప్తగిరి సర్కిల్: రెండు రోజులుగా కొనసాగిన ఎక్సైజ్ శాఖ క్రీడా పోటీలు ఆదివారం ముగిసాయి. క్రీడా పోటీలు ఆదివారం ఆలమూరు రోడ్డులో సైక్లింగ్, ఇండోర్ క్రీడా పోటీలు స్థానిక అనంతపురం క్లబ్లో నిర్వహించారు. జిల్లాకు చెందిన ఎక్సైజ్ శాఖ సిబ్బంది పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఉదయం సైక్లింగ్ పోటీలు నిర్వహించారు. షటిల్, బాల్ బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్స్ క్రీడా పోటీలను అనంతపురం క్లబ్లో నిర్వహించారు.
క్రీడలు స్నేహ భావాన్ని పెంపొందిస్తాయి
నిత్యం పని ఒత్తిడితో సతమతమయ్యే ఎక్సైజ్ శాఖ ఉద్యోగులకు క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని డిప్యూటీ కమిషనర్ అనసూయదేవి తెలిపారు. ఆదివారం అనంతపురం క్లబ్లో జరిగిన జిల్లాస్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమెతో పాటు అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ పోటీల్లో పాల్గోనే వారు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు మల్లారెడ్డి, మునిస్వామి, రాష్ట్ర ఎక్సైజ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరసింహులు, క్రీడల రిఫరీగా గుత్తి ఎక్సైజ్ సీఐ రాజశేఖర్ గౌడ్ వ్యవహరించారు. ఎస్సై జాకీర్‌హుస్సేన్, రాముడు, బాలాజి నాయక్, తదితరులు పాల్గొన్నారు.
రెండోరోజు విజేతలు వీరే
షటిల్ పురుషుల విభాగం:
మధుసూదన్ నాయుడు(అనంతపురం), సాల్మన్ రాజు (హిందూపురం), నరసింహులు(ధర్మవరం), రామ్మోహన్ (ఓబుళాపురం).
సైక్లింగ్ 5 కి.మీ: భక్తర్‌వలి(తాడిపత్రి), భీమేష్(కణేకల్లు), ఓబులేసు(కణేకల్లు), వెంకటనారాయణ(తాడిపత్రి).
టేబుల్ టెన్సిస్: వలి(డీసీ కార్యాలయం).
చదరంగం: హేమంత్‌కుమార్, నాగభూషణం.
బాల్ బ్యాడ్మింటన్ :
కృష్ణమూర్తి(కదిరి), మధుసూదన్ నాయుడు(అనంతపురం), నాగభూషణం(ధర్మవరం), వలి(డీ సీ కార్యాలయం), ఉమామహేశ్వరరావు( డీ సీ కార్యాలయం), సాల్మన్ రాజు (హిందూపురం).
క్యారమ్స్: రాముడు, ఖలందర్, వలి, కృష్ణయ్య.