Complaint case
-
భార్యను వదిలేసి స్వాతి టీచర్‌తో న్యాయవాది.. చిత్ర హింసలు.. కాదు కిడ్నాప్!
సాక్షి, చైతన్యపురి: కన్న కొడుకును చిత్రహింసలు పెట్టాడని భార్య ఫిర్యాదుతో ఓ న్యాయవాదిపై సరూర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఆర్డర్‌పై తన వద్ద ఉన్న కుమారుడిని బలవంతంగా తీసుకెళ్లారని న్యాయవాది ఫిర్యాదు చేశాడు. దీంతో ఇరువురిపై కేసులు నమోదైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ మాధవరావు తెలిపిన వివరాల ప్రకారం.. డాక్టర్స్ కాలనీలో నివసించే న్యాయవాది దేవులపల్లి సంతోష్‌కుమార్‌కు ఉమామహేశ్వరితో 11 సంవత్సరాల క్రితం పెళ్లైంది. వీరికి అర్షిత్‌సాయి (10), కల్యాణ్‌సాయి (8) కుమారులు ఉన్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావటంతో వేర్వేరుగా ఉంటున్నారు. కోర్టులో కేసు నడుస్తోంది. నాలుగు నెలల క్రితం కోర్టు ఆర్డర్ ప్రకారం ఇద్దరు కుమారులను సంతోష్‌కుమార్ తన వద్దకు తెచ్చుకున్నాడు. ఇదిలా ఉండగా, సోమవారం గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఉమామహేశ్వరికి ఫోన్‌కాల్ వచ్చింది. తప్పిపోయిన మీ కుమారుడు తమ వద్ద ఉన్నాడని చెప్పాడు. అక్కడికి వెళ్లిన ఉమామహేశ్వరికి తన పెద్ద కుమారుడు అర్షిత్‌సాయి కనిపించాడు. ఒంటిపై గాయాలు ఉన్నాయి. తనను తండ్రి సంతోష్‌కుమార్, ఆయనతో పాటు ఉంటున్న టీచర్ స్వాతి తనను చిత్రహింసలు పెట్టారని తల్లికి వివరించాడు. స్వాతి టీచర్ గరిటెతో పొట్టపై వాతలు పెట్టిందని, తండ్రి బెల్ట్‌తో కొట్టాడని చెప్పటంతో ఉమామహేశ్వరి సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనపై కోపంతో తమ కుమారుడిని చిత్రహింసలు పెట్టిన భర్త సంతోష్‌కుమార్, స్వాతిపై చర్యలు తీసుకోవాలని కోరింది. చదవండి: కూతురిపై కన్నేసిన తండ్రి.. కాపాడిన సవతి తల్లి తన కుమారుడు అర్షిత్ సాయిని తాము చిత్రహింసలు పెట్టిన మాట వాస్తవం కాదని.. కోర్టు అనుమతితో తీసుకొచ్చిన తన కుమారుడిని ఉమామహేశ్వరి, ఆమె సోదరుడు శివకుమార్ బలవంతంగా తీసుకెళ్లారని సంతోష్ కుమార్ సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇరువురి ఫిర్యాదు స్వీకరించి రెండు కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ మాధవరావు తెలిపారు. చదవండి: ఎమ్మెల్యే పేరుతో ఉన్న కారు బీభత్సం.. స్పందించిన బోధన్ ఎమ్మెల్యే -
ఎమ్మెల్యే వనమాపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
సుజాతనగర్: కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జిల్లా నాయకులు నాగా సీతారాములు మాట్లాడుతూ గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బీ ఫాం పొందిన వనమా వెంకటేశ్వరరావు ఇప్పుడు పార్టీ మారి నియోజకవర్గ ప్రజలను మోసం చేశాడన్నారు. ఒక పార్టీ నుంచి బీ ఫాం పొంది మరో పార్టీలో చేరడం అనైతికమని, తన స్వలాభం కోసమే పార్టీ ఫిరాయించాడని ఆరోపించారు. నియోజకవర్గ ప్రజలు టీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్‌కు ఓట్లేసి గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలను ఎలా మోసం చేస్తాడని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన వనమాపై 405, 406, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చింతలపూడి రాజశేఖర్, తాళ్లూరి శ్రీనివాసరావు, మండల నాయకులు మడిపల్లి శ్రీనివాసరావు, పంజాల శ్రీనివాసరావు, రామ్‌లక్ష్మణ్, అజ్జూ, ఆబిద్, నరేష్, చంటి, షరీఫ్ పాల్గొన్నారు. -
21 మంది తెలుగు ఎంపీలపై ముజఫర్ పూర్ లో కేసు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రతిష్టను మంటగలిపారంటూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన 21 మంది ఎంపీలపై బీహార్ లోని ముజఫర్ పూర్ లో కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీలపై రాజద్రోహం, ఇతర కేసులను నమోదు చేశారు. సెక్షన్ 504, 323, 124బీ, 308, 120బీ కింద చీఫ్ జుడిషిలయ్ మేజిస్ట్రేట్ ఎస్ పీ సింగ్ కోర్టులో స్థానిక న్యాయవాది సుధీర్ కుమార్ ఓజా ఫిర్యాదు చేశారు. లోకసభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా సభ గౌరవాన్ని కాపాడాల్సిన సభ్యులే గలాటా సృష్టించడం, ఇతర సభ్యులపై పెప్పర్ స్పే చల్లడం భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చ తెచ్చేలా ఉంది అని ఫిర్యాదులో ఓజా పేర్కోన్నారు. ఎంపీల ప్రవర్తనపై దినపత్రికలో వచ్చిన కథనం తలదించుకునేలా ఉందని ఓజా తెలిపారు. పార్లమెంట్ ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రవర్తించిన సభ్యులపై చర్యలు తీసుకోవాలని ఓజా పిటిషన్ లో తెలిపారు. పిటిషన్ పై విచారణను మార్చి 7 తేదికి వాయిదా వేశారు.