వంటింటి చిట్కాలు
♦ ఉపయోగించిన టూత్ బ్రష్‌లతో వంటింట్లో సింకులు, కంప్యూటర్ కీ బోర్డులు, టీవీ రిమోట్లు శుభ్రం చేసుకోవచ్చు.
♦ ఛీజ్ నిల్వ చేసే డబ్బాలో చిన్న పటిక బెల్లం ముక్క వేసి ఉంచితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
♦ కోసిన ఉల్లిపాయ సగమే వాడినప్పుడు మిగతా సగం ముక్కకు వెన్న రాసి ఉంచాలి. తాజాగా ఉంటుంది.
♦ వేడి చేసిన గరిటెతో జాడీలో నుంచి ఊరగాయను బయటకు తీస్తే అది పాడవకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.
♦ బియ్యం నిల్వ ఉంచిన డబ్బాలో నాలుగు ఎండు మిరపకాయలు వేస్తే పురుగు పుట్టదు.
♦ పెరుగు పచ్చడి మరింత రుచిగా ఉండాలంటే తాలింపులో చెంచా నెయ్యి కలపాలి.
♦ కూరల్లో, పులుసులో ఉప్పు కారం ఎక్కువైనప్పుడు రెండు చెంచాల శనగపిండిని వేయించి కలపాలి.
♦ మరీ నిల్వ ఉంచిన శనగపిండిని పారేయకుండా స్టీలు గిన్నెలు, వెండి సామాన్లను తోమితే శుభ్రపడతాయి.
♦ మజ్జిగ పల్చనైతే పది కరివేపాకు ఆకులు, కాస్త ఉప్పు కలిపి నూరి ముద్దలా చేసి కలిపితే చిక్కబడుతుంది.
♦ తెల్లని బట్టలు ఉతికాక పసుపు మరకలు అలాగే ఉంటే బోరిక్ పౌడర్ కలిపిన నీటిలో కొద్ది సేపు నానబెట్టి, ఉతికి ఎర్రటి ఎండలో ఆరేయాలి.
♦ రోజ్‌వాటర్‌లో ముంచిన దూది ఉండను హ్యాండ్‌బ్యాగులో ఉంచితే దుర్వాసన రాదు.
♦ హ్యాండ్ వాష్ లిక్విడ్‌ను దూదితో అద్దుకొని తుడిస్తే లెదర్ బ్యాగుల దుమ్ము సులువుగా వదిలిపోతుంది.