రేపు ట్రెయినర్లకు ఇంటర్వ్యూలు
వీరన్నపేట (మహబూబ్నగర్) : నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చే ట్రెయినర్లకు ఈనెల 15న ఇంటర్వూ్యలు నిర్వహించనున్నట్టు తెలంగాణ జాగృతి సంస్థ జిల్లా అధ్యక్షుడు వెంకట్రామమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఆరోజు జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ హాస్పిటల్ పక్కన, లక్ష్మి గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. పూర్తి వివరాలకు సెల్ నం.8686793145ను సంప్రదించాలని ఆయన కోరారు.