ఐదు ప్రయత్నాల్లో అన్ లాక్!
లండన్ : ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే వారిలో ఎక్కువ మంది తమ ఫోన్లకు ప్యాటర్న్ లాక్‌లు పెట్టుకుంటూ ఉంటారు. ప్యాటర్న్లాక్ ఉన్న ఫోన్లను ఇతరులెవరైనా కేవలం ఐదంటే ఐదే సార్లు ప్రయత్నించి అన్ లాక్ చేయగలరట. సరళంగా ఉండే ప్యాటర్న్‌ల కంటే క్లిష్టంగా ఉండే ప్యాటర్న్‌లను అన్ లాక్ చేయడం చాలా సులభమట. అయితే ఇది కంప్యూటర్ విజన్ అల్గారిథమ్ సాఫ్ట్వేర్ ఉంటేనే సాధ్యం.
అలాగే ఫోన్‌ను యజమాని అన్ లాక్ చేస్తున్నప్పుడు దుండగులు అతని వేళ్ల కదలికలను దూరం నుంచైనా వీడియో తీసి ఉండాలి. ఇక అంతే! తర్వాత ఎప్పుడైనా యజమాని ఫోన్ దుండగుల చేతుల్లోకి వెళ్లినప్పుడు ఈజీగా అన్ లాక్ చేయగలరట. బ్రిటన్ , చైనా శాస్త్రవేత్తల పరిశోధనలో ఇది వెల్లడైంది.