Conductor job
-
25 పైసల కోసం పోయిన ఉద్యోగం 23 ఏళ్లకు వచ్చింది
- 25 పైసల విషయంలో వివాదం.. - టికెట్ ఇవ్వలేదంటూ 1993లో విధుల నుంచి తొలగించిన ఆర్టీసీ - విధుల్లోకి తీసుకోవాలని తాజాగా ఆర్టీసీకి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: 25 పైసలు.. ఇప్పుడు చెలా మణిలో లేవు. కానీ, అవే 25 పైసలు 23 ఏళ్ల కింద ఓ కండక్టర్ ఉద్యోగం పోగొట్టుకోవడానికి కారణమయ్యాయి. 23 ఏళ్ల తర్వాత ఆ కండక్టర్‌కు హైకోర్టు ఊరటనిచ్చింది. 75 పైసల టికెట్ కోసం ఓ ప్రయాణికుడి నుంచి 50 పైసలు తీసుకుని టికెట్ ఇవ్వలేదని, అలాగే ఇద్దరు మహిళలు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నా పట్టించుకో లేదన్న ఆరోపణలతో ఆ కండక్టర్‌ను ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించింది. అయితే ఆ కండక్టర్‌ను తొలగించడాన్ని హైకోర్టు ధర్మాసనం తప్పుపట్టింది. ఆ కండక్టర్‌ను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని, అతడికి చెల్లిం చాల్సిన బకాయిలన్నింటినీ చెల్లించాలన్న పారి శ్రామిక ట్రిబ్యునల్ ఉత్తర్వులతో ఏకీభవిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్థించింది. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ ఆర్టీసీ యాజమాన్యం దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరిం చింది. చార్మినార్–ఫతేదర్వాజ మార్గంలో నడిచే బస్సులో ఎం.ఎల్.అలీ కండక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించేవాడు. 1993 అక్టోబర్ 27న ఆర్టీసీ ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్ అధికారులు అలీ విధులు నిర్వర్తిస్తున్న బస్సులో తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఓ ప్రయాణికుడి నుంచి 50 పైసలు వసూలు చేసి టికెట్ ఇవ్వలేదని, ఓ ఇద్దరు మహిళలు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నా పట్టించు కోలేదంటూ అలీపై అధికారులు క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. విచారణ జరిపిన అధికారులు అలీని ఉద్యోగం నుంచి తొలగిస్తూ 1994 మార్చి లో ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను అప్పీలెట్ అథారిటీ, ఆ తర్వాత రివ్యూ అథారిటీ కూడా సమర్థించాయి. అలీకి అనుకూలంగా ఉత్తర్వులు.. 1997లో ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్‌ను అలీ ఆశ్రయించాడు. పూర్తిస్థాయిలో విచారణ జరి పిన ట్రిబ్యునల్ అలీకి అనుకూలంగా ఉత్తర్వు లిచ్చింది. వీటిపై ఆర్టీసీ యాజమాన్యం 1999లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిం ది. విచారణ జరిపిన సింగిల్ జడ్జి ట్రిబ్యునల్ ఉత్తర్వులను సమర్థిస్తూ అలీని విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. సింగిల్ జడ్జి తీర్పుపై ఆర్టీసీ యాజమాన్యం 2009లో ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. 75 పైసల టికెట్ కోసం ప్రయాణికుడు 50 పైసలు ఇచ్చి సరిపెట్టడంతో, మిగిలిన 25 పైసల కోసం డిమాండ్ చేస్తూ తాను టికెట్ ఇవ్వలేదని, ఈ మధ్యలోనే స్క్వాడ్ వచ్చి తనిఖీలు చేసిందన్న కండక్టర్ వాదనను అధికారులు పరిగణనలోకి తీసుకోకపోవడా న్ని ధర్మాసనం తప్పుపట్టింది. ఇద్దరు మహి ళల వద్దకు వచ్చి టికెట్ ఇచ్చేలోపే స్క్వాడ్ వచ్చిన విషయాన్ని కూడా అధికారులు పట్టించుకోలేదని, ఈ విషయంలో డ్రైవర్ వాంగ్మూలాన్ని కూడా పరిగణించకపోవడం అన్యాయమని పేర్కొంది. -
సమస్యల హారన్
ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ : రైట్ రైట్ అనగానే ముందుగా గుర్తొచ్చేది కండక్టర్లు. కండక్టర్ ఉద్యోగం అంటేనే కొందరు పురుషులు జంకుతుంటారు. అలాంటిది ఆర్టీసీ లో పురుషులకు దీటుగా మహిళా కండక్లర్లూ విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంట్లో భర్త, పిల్లలకు సేవచేస్తూనే ఇటూ ఉద్యోగంలోనూ దూసుకెళ్తు న్నారు. అయినా.. నిత్యం వారికి కష్టాలు తప్పడం లేదు. కార్మిక చట్టం ప్రకారం 7.20 గంటలు పనిచేయాలి. కానీ, ఉదయం నుంచి రాత్రి వరకు ఎనిమిది గంటలపాటు పనిచేస్తున్నారు. వేతనాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. మహిళా కండక్టర్లకు ప్రత్యేక సౌకర్యాలు కనిపించవు. మహిళా సంఘాలు కూడా సమస్యలపై పోరాటాలు చేసినా పరిష్కారానికి నోచుకోవడం లేదు. జిల్లాలో ఆరు డిపోలు ఉండగా, 219 మంది మహిళా కండక్టర్లు పనిచేస్తున్నారు. ఆదిలాబాద్‌లో డిపోలో 45, ఆసిఫాబాద్‌లో 23, భైంసాలో 22, మంచిర్యాలలో 85, నిర్మల్‌లో 41, ఉట్నూర్‌లో 3 మంది మహిళా కండక్టర్లు పనిచేస్తున్నారు. వీరి సమస్యలు పరిష్కారంలో ఆర్టీసీ అధికారులు అలసత్వం వ్యవహరిస్తున్నారు. 240 రోజులకు బదులు 120 రోజులకు ప్రసూతి సెలవులు ఇవ్వడంతో అవస్థలు పడుతున్నారు. మహిళా కండక్టర్ల డిమాండ్లు.. ముందస్తుగా పెట్టుకున్న సెలవులు మంజూరుచేయాలి. {పసూతి సెలవులు 240 రోజులు ఇవ్వాలి. ఆయా డిపోల్లో ప్రత్యేక విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు, భోజన గదిని నిర్మించాలి. కార్మిక చట్టం ప్రకారం వారాంతపు సెలవులు ఇవ్వాలి. రాత్రి ఎనిమిది గంటల లోపు ఇంటికి చేరాలా డ్యూటీలు వేయాలి. డే ఔట్ డ్యూటీ చేసిన తర్వాత ప్రత్యేక సెలవు ఇవ్వాలి. ఒక రోజు తప్పించి ఒక రోజు డే ఔట్.. డే డ్యూటీలు వేయాలి. మహిళా కండక్టర్ యూనిఫాంలను అందించాలి. ఎండీ సర్క్యూలర్ ప్రకారం ఫిక్స్డ్ చాట్ వేయాలి.