తాండూరులో కాంట్రాక్టు ఉద్యోగి ఆత్మహత్య
తాండూరు : రంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాండూరుకు చెందిన మహేశ్ అనే వ్యక్తి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఉన్నతాధికారుల వేధింపులే తన మరణానికి కారణమని మహేశ్ సూసైడ్ నోట్లో రాసి ప్రాణాలు తీసుకున్నాడు.
దీంతో అతని బంధువులు మున్సిపల్ కార్యాలయం ముందు మృతదేహంతో ధర్నాకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు మహేశ్ బంధువులతో చర్చిస్తున్నారు.