తస్లీమా వీసా పొడిగింపునకు కేంద్రం హామీ!
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌కు చెందిన వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ శనివారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిశారు. భారత్‌లో నివసించేందుకు తనకు ఏడాది కాలవ్యవధిగల వీసా మంజూరు చేయాలన్న విజ్ఞప్తిని ప్రభుత్వం బుధవారం తిరస్కరించి ఆగస్టు 1 నుంచి కేవలం రెండు నెలల తాత్కాలిక నివాసానికి అంగీకరించిన నేపథ్యంలో దీనిపై చర్చించేందుకు ఆయనతో భేటీఅయ్యారు.
సుమారు 20 నిమిషాలపాటు జరిగిన ఈ భేటీలో తన వీసాను పొడిగించాలని ఆమె రాజ్‌నాథ్‌ను కోరినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ భేటీ గురించి తస్లీమా ట్వీట్ చేస్తూ రాజ్‌నాథ్‌కు తన పుస్తకం ‘వో అంధేరే దిన్’ (ఆ చీకటి రోజులు)ను అందించానని...దీనికి ఆయన బదులిస్తూ ‘మీ చీకటి రోజులు ముగిసిపోతాయి’ అని అన్నారని పేర్కొన్నారు.