రైతులకు మరిన్ని సేవలందించాలి
జిల్లా సహకారశాఖ అధికారి ప్రవీణ
పెనుగుదురు(కరప) :
ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల(పీఏసీఎస్) ద్వారా రైతులకు మరిన్ని సేవలందించాలని జిల్లా సహకారశాఖ అధికారి (డీసీఓ) టి.ప్రవీణ సూచించారు. మండలంలోని పెనుగుదురు సొసైటీ కార్యాలయం వద్ద జ్వోతి ప్రజ్వలన చేసి 63వ సహకార వారోత్సవాలను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు సకాలంలో పంట రుణాలు అందించడంతో పాటు, వారిని చైతన్య పరచి అధిక మొత్తంలో డిపాజిట్లు సేకరించాలన్నారు. కార్యాలయాల్లో స్ట్రాంగ్‌రూంలు ఏర్పాటు చేసి బంగారు ఆభరణాలపై రైతులకు రుణాలు అందజేయాలని సూచించారు. సహకార సంఘాలు లాభాలు సాధించేలా పాలకవర్గాలు, సిబ్బంది సమష్టిగా పనిచేయాలన్నారు. సొసైటీ అధ్యక్షుడు, మండల వైఎస్సార్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడు చీకాల అప్పలరాజు ఏడురంగుల సహకార జెండా ఆవిష్కరించారు. జిల్లా సహకార ఎడ్యుకేషనల్ ఆఫీసర్, వారోత్సవాల ప్రత్యేకాధికారి ఆదిమూలం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉద్యోగులు వృత్తి నైపుణ్యం పెంచుకునేందుకు సూచనలిచ్చారు. విద్యార్థులకు ఇంగ్లిష్ నిఘంటువులను డీసీఓ ప్రవీణ అందజేశారు. సీఈఓ తిబిరిశెట్టి వీరభద్రరావు, ఉపాధ్యక్షుడు చీపురపల్లి జయేంద్రబాబు, డైరెక్టర్లు కలవల రాజు, టి.గోవిందు తదితరులు పాల్గొన్నారు.
రైతుల అభివృద్ధికి కృషి
బోట్‌క్లబ్ : రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని డీసీసీబీ చైర్మ¯ŒS వరపుల రాజా తెలిపారు. స్థానిక డీసీసీబీ కార్యాలయంలో సోమవారం సహకార వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సంవత్సరం రైతులకు దీర్ఘకాలిక రుణాలు రూ.102 కోట్లు ఇచ్చి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉన్నట్టు చెప్పారు. స్వల్ప కాలిక రుణాలు రూ.720 కోట్లు ఇచ్చామన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ సిబ్బంది పాల్గొన్నారు.