విజేత మెరైన్ ట్రాన్స్
జింఖానా, న్యూస్‌లైన్: సీవేస్ గ్రూప్ కార్పొరేట్ టి20 క్రికెట్ టోర్నీలో మెరైన్ ట్రాన్స్ జట్టు విజేతగా నిలిచింది. గచ్చిబౌలిలో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో మెరైన్ ట్రాన్స్ 39 పరుగుల తేడాతో సీవేస్ లెజెండ్స్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన మెరైన్ ట్రాన్స్ 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన సీవేస్ లెజెండ్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 102 పరుగులు మాత్రమే చేయగలిగింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ టైటిల్‌ను మెరైన్ ట్రాన్స్ ఆటగాడు ప్రమోద్ దక్కించుకోగా... మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌ను ప్రతాప్ హెల్త్ కేర్ క్రీడాకారుడు వెంకట్ రెడ్డి సొంతం చేసుకున్నాడు. బెస్ట్ బ్యాట్స్‌మన్ టైటిల్‌ను హెచ్వైసీఏఏ ఆటగాడు జతిన్, బెస్ట్ బౌలర్ టైటిల్‌ను సీవేస్ లెజెండ్స్ క్రీడాకారుడు రియాజ్ ఖురేషి సాధించారు. విజేతలకు సీవేస్ గ్రూప్ చైర్మన్ కెప్టెన్ పీవీకే మెహన్ ముఖ్య అతిథిగా విచ్చేసి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీవేస్ డెరైక్టర్లు వివేక్ ఆనంద్, శరత్ తదితరులు పాల్గొన్నారు.