ఎస్బీహెచ్ ఘనవిజయం
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) టి20 క్రికెట్లో ఎస్బీహెచ్ జట్టు 8 వికెట్ల తేడాతో వాల్యూ ల్యాబ్స్ జట్టుపై ఘనవిజయం సాధించింది. సాషా స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన వాల్యూ ల్యాబ్స్ 18.4 ఓవర్లలో 107 పరుగులు చేసి ఆలౌటైంది. రాహుల్ (35 బంతుల్లో 48, 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు.
ఎస్బీహెచ్ బౌలర్లలో శ్రీధరన్, పవన్ చెరో 3 వికెట్లు తీశారు. అనిరుధ్ సింగ్కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత 108 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ఎస్బీహెచ్ కేవలం 9.3 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వెంకట్ (32 బంతుల్లో 68 నాటౌట్, 10 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్ధసెంచరీతో జట్టును గెలిపించి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.
ఇతర మ్యాచ్ల స్కోర్లు
మై హోమ్: 174/9 (అశ్విన్ 64, అంకుర్ 34; జర్కాశ్ 3/13, నాగరాజు 3/37), అమెజాన్: 153/9 (అర్చిత్ 31, చరణ్ 23, సందీప్ పటేల్ 23; సత్య 4/19)
గ్రాన్యుల్స్ ఇండియా: 147/7 (మదుమ్ 50 నాటౌట్, రాజశేఖర్ 35, పెంచయ్య 22; ఇర్ఫాన్ 3/28), బకార్డి: 125/8 (ఇర్ఫాన్ 60; డేవిడ్ 2/19)
ఇనెసిస్: 142/8 (బి.వి.రావు 28, లాయిడ్ 26, సంతోష్ 22; రాజేశ్ 3/19, కిరణ్ 3/25), సేల్స్ ఫోర్స్: 97/9 (ఆశిష్ 31; అశ్విన్ 3/21).