ఆరెంజ్ తో ఓ రెంజ్ లో
ఫుడ్ n బ్యూటీ
ఆరెంజ్‌ని తింటే ఆరోగ్యాన్నిస్తుంది.ముఖానికి రాసుకుంటే సౌందర్యాన్ని పెంచుతుంది. కాస్మొటిక్ స్కిన్ కేర్లకు దీటుగా పనిచేస్తుంది. ఇందులోని విటమిన్ ‘సి’ చర్మానికి నిగారింపును పెంచుతుంది. ఆరెంజ్‌తో ఫేస్‌ప్యాక్‌లను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం...
కమలాపండు రసాన్ని రెండు టీ స్పూన్ల పెరుగుతో కలిపి పేస్ట్‌లా చేసుకొని ముఖానికి, మెడకు పట్టించాలి. 20 నిమిషాల తర్వాత చన్నీటితో ముఖం కడిగితే... మార్పు మీకే అర్థం అవుతుంది.
రెండు టీస్పూన్ల ఆరెంజ్జ్యూస్కు కొద్దిగా నిమ్మరసం, ఒక స్పూన్ తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖం, మెడకు పట్టించి ఆరాక చన్నీటితో కడగాలి.
ఆరెంజ్ జ్యూస్, ముల్తానీ మట్టి, పాలు కలిపి ముఖానికి పట్టించి ఆరాక వేడి నీటితో కడగాలి. ఈ ప్యాక్ వేస్తే ముఖం ప్రకాశవంతమవుతుంది.
ఆరెంజ్ తొక్కలను ఎండబెట్టి పొడి చేసుకొని, ఆ పొడిని రోజ్ వాటర్‌తో కలిపి ముఖానికి రాసుకుంటే కొత్త కళ వస్తుంది.