costly bags
-
ఖరీదైన బ్యాగ్ గిఫ్ట్.. దక్షిణ కొరియా రాజకీయాల్లో దుమారం
ఓ ఖరీదైన బ్యాగ్ దక్షిణ కొరియా రాజకీయాల్లో చిచ్చుపెట్టింది. దీనికి గల కారణం దక్షిణ కొరియా మొదటి మహిళ ఆ బ్యాగ్ గిఫ్ట్‌గా స్వీకరించటమని ఆరోపణలు వస్తున్నాయి. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ భార్య కిమ్ కియోన్ హీ(దక్షిణ కిరియా మొదటి మహిళా) రెవ్ అబ్రహం చోయ్ అనే ఓ పాస్టర్ నుంచి ఓ ఖరిదైన డియోర్ బ్యాగ్‌ను కానుకగా స్వీకరించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ వ్యవహారం దక్షణి కొరియా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అక్కడి చట్టాల ప్రకారం ఒక మిలియన్ వాన్(రూ. 62,160) కంటే విలువైన వస్తువులు, కానుకలు, బహుమతుల స్వీకరించరాదు. అలా తీసుకుంటే దాన్ని అక్కడి చట్టాలు లంచంగా పరిగణిస్తాయి. దక్షిణా కొరియాలో లంచం వ్యతిరేక చట్టం చాలా కఠినంగా అమల్లో ఉంది. ఈ క్రమంలో దేశ మొదటి మహిళ సుమారు మూడు మిలియన్ వాన్స్( సుమారు రూ. 1,86,811) విలువైన డియోర్ బ్యాగ్‌ను అబ్రహం చోయ్ నుంచి ఆమె స్వీకరించటం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో దక్షిణ కొరియాలో జరగనన్ను అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ కిమ్ కియోన్ హీ ఖరిదైన బ్యాగ్ వ్యవహారం అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు తల నొప్పిగా మారింది. రెవ్ అబ్రహం చోయ్ నుంచి కిమ్ కియోన్.. ఓ ఖరిదైన డియోర్ బ్యాగ్‌ను బహుమతిగా తీసుకున్నట్లు గతేడాది నవంబర్‌లో ఓ రహస్య కెమెరా ఫుటేజీ ద్వారా బయటపడింది. అయితే రెవ్ అబ్రహం చోయ్ ఆ బ్యాగ్‌ను కొనుగోలు చేసి కిమ్ కియోన్కు తన ఆఫీసులో కలవటానికి వెళ్లి ఆమె ఇవ్వడాని ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఇక.. ఇలాంటి విలువైన వాటిని ఎందుకు తీసుకువస్తున్నారని ఆమె ప్రశ్నించినట్లు సమాచారం. మరోవైపు ఆమె ఆ బ్యాగ్‌ను కూడా తీసుకున్నట్లు ఆ వీడియోలో కనిపించటం లేదని స్థానిక మీడియా పేర్కొనటం గమనార్హం. అయితే ఈ బ్యాగ్ అధ్యక్ష కార్యాలయంలో గుర్తించబడింది. దీంతో ప్రతిపక్షాలు అధ్యక్షుడి భార్య చట్టవ్యతిరేకంగా బ్యాగ్ రూపంలో లంచం తీసుకుందని ఆరోపిస్తూ.. అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వటంతో పాటు క్షమాపణ చెప్పాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఇప్పటికే మైనార్టీ ప్రభుత్వంగా కొనసాగుతున్న అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌పై రాజకీయ ఒత్తిడి పెరుగుతోంది. అదీకాక ఈ వ్యవహారం.. ఏప్రిల్ 10న జరగబోయే అధ్యక్ష ఎన్నికలపై యూన్ సుక్ యోల్ చెందిన పీపుల్ పవర్ పార్టీ(PPP)పై ప్రతికూల ప్రభావం చూపనుందని చర్చ జరుగుతోంది. చదవండి: టెక్సాస్, ఫెడరల్ ప్రభుత్వాల మధ్య తీవ్రమవుతున్న సరిహద్దు గొడవ -
కాస్ట్లీ హ్యాండ్‌బ్యాగ్ ట్రోలింగ్‌పై స్పందించిన ఎంపీ
న్యూఢిల్లీ: ఒకవైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ధరల పెరుగుదల అంశంపై ఉభయ సభలు అట్టుడుకిపోతున్నాయి. విపక్షాలు ధరల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సోమవారం లోక్‌సభలో విపక్ష పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత కకోలి ఘోష్ దస్తిదార్ ధరల పెరుగుదల అంశంపై మాట్లాడుతున్నారు. ఆ సమయంలో.. ఆమె పక్కనే ఉన్న మరో ఎంపీ మహువా మోయిత్రా తన ఖరీదైన హ్యాండ్ బ్యాగ్‌ను టేబుల్ కింద దాచేశారు. అంతే.. అధిక ధరల గురించి మాట్లాడుతున్నందునే ఆమె తన కాస్ట్లీ బ్యాగ్‌ను కనిపించకుండా పక్కన పెట్టారంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఆ బ్యాగు లూయిస్ వియుట్టన్ కంపెనీ బ్రాండ్. ధర రెండు లక్షల రూపాయల దాకా ఉంటుంది. దీంతో రాజకీయంగానూ ఈ సీన్‌పై విమర్శలు మొదలయ్యాయి. అవినీతిలో కూరుకుపోయిన పార్టీ సభ్యులు.. ఇలా వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ నేతలు, మద్దతుదారులు వ్యంగ్యం ప్రదర్శించారు. ఆఖరికి మీమ్స్గానూ ఆమె వీడియో ట్రెండ్ అయ్యింది. ఈ తరుణంలో సోషల్ మీడియా సెటైర్లు, రాజకీయ విమర్శలపై ఆమె సింపుల్‌గా స్పందించారు. Jholewala fakir in Parliament since 2019. Jhola leke aye the… jhola leke chal padenge… pic.twitter.com/2YOWst8j98 — Mahua Moitra (@MahuaMoitra) August 2, 2022 జోలేవాలా ఫకీర్‌ను 2019 నుంచి పార్లమెంట్లో ఉన్నా. బ్యాగుతో వచ్చాం.. బ్యాగుతోనే వెళ్తాం అంటూ ట్వీట్ చేశారామె. అయితే ఆమె ట్వీట్లో లోతైన అర్థం దాగుండడం గమనార్హం. ఒక్కసారి వెనక్కి వెళ్తే.. 2016 యూపీ మోరాదాబాద్ పరివర్తన్ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ తనను తాను ఓ ఫకీర్‌గా అభివర్ణించుకున్నారు. రాజకీయాల నుంచి ప్రత్యర్థులు తనను దూరం చేయాలని ప్రయత్నిస్తే.. సాదాసీదా వ్యక్తినైన తాను ఫకీర్లాగా జోలె పట్టుకుని ముందుకు వెళ్తానని.. అంతేగానీ అవినీతికి వ్యతిరేకంగా పోరాడటం తాను ఆపబోనని భావోద్వేగంగా ప్రసంగించారు ఆయన. Marie Antoinette Mahau Moitra hiding her expensive bag during a discussion on price rise- hypocrisy has a face & its this! A party that believes in TMC- Too Much Corruption discusses price rise after not cutting VAT & alliance with UPA that gave run away inflation of 10% plus pic.twitter.com/VByJsk4tBV — Shehzad Jai Hind (@Shehzad_Ind) August 1, 2022 -
అలా శిల్పాశెట్టిని ఇంప్రెస్ చేసిన రాజ్‌కుంద్రా
Raj kundra-Shilpa shetty love story: రాజ్‌కుంద్రా.. గత కొన్నిరోజుల నుంచి ఈ పేరు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. మీడియా, వెబ్సైట్లు, సోషల్ మీడియాలోనూ కుంద్రా భాగోతంపై జోరుగా చర్చ నడుస్తుంది. లండన్‌కు చెందిన రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ కావడంతో సినీ ఇండస్ర్టీ ఒక్కసారిగి ఉలిక్కిపడింది. ఇక భర్త అరెస్ట్ అనంతరం అఙ్ఞాతంలోకి వెళ్లిపోయిన శిల్పా తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒకప్పుడు శాలువాలు అమ్మిన రాజ్‌కుంద్రా అప్పటి స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టిని ఎలా వల్లో వేసుకున్నారన్నదానిపై నెట్టింట జోరుగా చర్చ నడుస్తుంది. రాజ్ కుంద్రా తండ్రి అక్కడ బస్సు కండక్టర్‌గా, తల్లి ఓ చిన్నషాపులో పని చేసేది. దీంతో 18 ఏళ్ల వయసులో దుబాయ్ అక్కడి నుంచి నేపాల్ వెళ్లిన కుంద్రా..మొదట శాలువాల బిజినెస్ చేశాడు. అయితే కొన్నేళ్ల తర్వాత తెలివిగా వాటిని బ్రిటన్‌కు చెందిన ఫ్యాషన్ హౌజ్ కంపెనీలకు విక్రయించి కోట్లు సంపాదించాడు. ఆ తర్వాత కన్ స్ట్రక్షన్ ట్రేడింగ్‌లో అడుగుపెట్టి లాభాలు ఆర్జించాడు. ఆ సమయంలోనే బాలీవుడ్ సినిమాలకు ఫైనాన్సింగ్ చేస్తూ సంజయ్ దత్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్లలతో పరిచయాలు ఏర్పరుచుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ డీల్ విషయంలో కామన్ ఫ్రెండ్ ద్వారా రాజ్ కుంద్రాను శిల్పా మొదటిసారి కలిసిందట. ఆమె నవ్వు, అందానికి తొలిచూపులోనే ఇంప్రెస్ అయిన కుంద్రా శిల్పాకు దగ్గరయ్యేందుకు చాలానే ప్రయత్నాలు చేసేవాడట. అప్పటినుంచి సందర్భం లేకున్నా ఆమెకు కాస్ట్లీ గిఫ్ట్‌లు ఇవ్వడం మొదలుపెట్టాడట. ఓసారి శిల్పాకు ఇష్టమైన కలర్ ఏంటో తెలియక ఒకే బ్రాండ్ ఉన్న ఖరీదైన మూడు బ్యాగులను వేరే వేరు రంగులతో ఆమెకు బహుమతిగా పంపించాడట. ఇది చూసి శిల్పా షాక్ అయ్యిందట. అంతేకాకుండా ఆ సమయంలో లండన్‌లోనే బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటండంతో పెళ్లి అయితే లండన్ వెళ్లడం ఇష్టం లేక ఇలాంటివి ఆపాల్సిందిగా శిల్పా కుంద్రాను కోరింది. దీంతో ఆమెను లండన్‌కు తీసుకెళ్లకుండా కుంద్రానే ముంబైలో ఓ ఇల్లు తీసుకున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా శిల్పా ఓ ఇంటర్వ్యూలోనూ రివీల్ చేసింది. అలా కుంద్రా తనపై చూపిస్తున్న ప్రేమకు అతనికి ఇంప్రెస్ అయినట్లు చెప్పుకొచ్చింది. ఇక వీరుద్దరు కొన్నాళ్లు డేటింగ్ అనంతరం 2009లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లికి ముందు బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా సత్తా చాటిన శిల్పా.. వివాహం అనంతరం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. మళ్లీ ఇన్నాళ్లకు హంగామా-2 చిత్రం ద్వారా మరోసారి కం బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. అయితే భర్త అరెస్ట్ శిల్పాకు ఊహించని షాక్ ఇచ్చింది. -
హ్యాండ్ బ్యాగ్ హ్యాండిల్ చేయాలిలా!!
ఆడవారికి అత్యవసరమైపోయిన వస్తువుల్లో హ్యాండ్ బ్యాగ్ ముఖ్యమైనది. ఒకప్పుడు అవసరమైన వస్తువుల్ని మోసేందుకు ఉపయోగించిన ఈ బ్యాగులు... ఇప్పుడు ఫ్యాషన్‌లో భాగమైపోయాయి. అందుకే ఆడవారిని అనుక్షణం అంటిపెట్టుకుని ఉంటున్నాయి. అయితే వీటిని క్యారీ చేస్తే చాలదు... పది కాలాల పాటు కాపాడుకోవాలంటే కేర్ తీసుకోవడం కూడా తెలియాలి. లేదంటే ఎంత ఖరీదైన బ్యాగ్ అయినా కళ్లు మూసి తెరిచేలోగా కళావిహీనమైపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే... ♦ అందరూ కామన్‌గా చేసే తప్పు... అవసరమైనవన్నీ బ్యాగులో కూరేయడం. అది ఇంత లావు అయిపోతుంది. దాంతో అందం పోతుంది. మీరు ఏం పెట్టినా, ఎన్ని పెట్టినా బ్యాగ్ షేప్ మారనివ్వనంత వరకే. ♦ పౌడర్, క్రీమ్, మాయిశ్చరైజర్, నూనె, జెల్, లిప్‌స్టిక్ అంటూ ప్రతి దానినీ బ్యాగులో వేసేస్తారు. అలా నేరుగా వేయకూడదు. ఒక పౌచ్‌లో వేసుకుని, ఆ పౌచ్‌ని బ్యాగ్‌లో వేసుకోవాలి. లేదంటే మరకలు పడిపోతాయి. ♦ సూదిగా ఉండే వస్తువులు బ్యాగ్‌లో వేయకూడదు. కావాలంటే బాక్స్‌లో కానీ పౌచ్‌లో కానీ పెట్టి వేసుకోవాలి. ♦ కూలింగ్ వాటర్ బాటిళ్లు, ఐస్‌క్రీమ్ వంటివి పెట్టకూడదు. ఆ తడి బ్యాగ్ మెటీరియల్‌ను పాడు చేస్తుంది. అలాగే లంచ్ బాక్సులు కూడా. అవి బ్యాగ్ సహజ వాసనను పోగొట్టి దుర్వాసనకు దారితీస్తాయి. ♦ ఏ క్రీమో, నూనో రాసేసుకుని ఆ చేత్తోనే వెంటనే బ్యాగ్ తీసుకుని బయలుదేరిపోతారు. ఆ అలవాటు చాలు బ్యాగ్‌ని పాడు చేయడానికి. శుభ్రంగా చేతులు కడుక్కుని, తుడుచుకున్నాకే బ్యాగ్ పట్టుకోవాలి. ♦ లెదర్ అయినా, మరే మెటీరియల్ అయినా సబ్బు పెట్టి ఉతక్కూడదు. నీటిలో లిక్విడ్ డిటర్జెంట్ కలిపి, మెత్తని గుడ్డను ముంచి, దానితో బ్యాగ్‌ను మృదువుగా తుడవాలి. ♦ మరకపడితే వీలైనంత త్వరగా దాన్ని తొలగించేందుకు ప్రయత్నించాలి. బాగా ఆరిపోయిన తర్వాత కొన్ని రకాల మెటీరియల్స్ మీది నుంచి మరకను తొలగించడం కష్టం. ♦ బ్యాగ్ దుర్వాసన వస్తోంటే డియోడరెంట్లు, సెంట్లు కొట్టకండి. ఓ చిన్న డబ్బాలో బేకింగ్ సోడాను వేసి బ్యాగ్‌లో ఉంచుకోండి. కొన్ని గంటలు గడిచేసరికి ఆ వాసనను సోడా పీల్చుకుంటుంది. దుర్వాసన పోతుంది. ♦ వాడనప్పుడు బ్యాగ్‌ని ఏ షెల్ఫులోనో పడేసి ఉంచుతారు. అలా చేయకూడదు. డస్ట్ బ్యాగ్స్ అని ఉంటాయి. వాటిలో పెట్టి దాచాలి. అప్పుడే దుమ్ము చేరకుండా ఉంటుంది. కావాలంటే దిండు కవర్లో పెట్టి కూడా దాచుకోవచ్చు.