పత్తి లారీ దగ్ధం
హనుమాన్‌జంక్షన్: చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై పత్తి లోడుతో వెళ్తున్న ఓ లారీ అగ్ని ప్రమాదంలో చిక్కుకుంది. ఈ ఘటన బుధవారం ఉదయం కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ పోలీస్‌స్టేషన్ ఎదురుగా జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా ఎడ్లపాడు నుంచి ఓ లారీ పత్తిలోడుతో బయల్దేరింది. ఈ లారీ కృష్ణా జిల్లా బాపులపాడు పరిధిలోని ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్స్ కంపెనీకి వెళ్లాల్సి ఉంది.
అయితే, లారీ డ్రైవర్‌కు రూట్ తెలియకపోవడంతో మధ్యలో సబ్రోడ్డులోకి వెళ్లి తిరిగి జాతీయ రహదారికి మళ్లాడు. ఈ కమ్రంలో ఎక్కడో లారీపైనున్న పత్తికి విద్యుత్ తీగలు తగలడంతో మంటలు అంటుకున్నాయి. అగ్ని మాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకురాగా, లారీపైనున్న పత్తిమాత్రం పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.5.60 లక్షల నష్టం వాటిల్లినట్టు సమాచారం.