councillor kidnap
-
'నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు'
-
'నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు'
తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు ఒకటో వార్డు కౌన్సిలర్ జానీ స్పష్టం చేశారు. శుక్రవారం సాక్షి మీడియాతో జానీ ఫోన్లో మాట్లాడారు. తాను అనారోగ్యంగా ఉన్నానని... అందువల్లే వైద్య చికిత్స కోసం జమ్మలమడుగు వదిలి వెళ్లానని తెలిపారు. తనను కిడ్నాప్ చేశారంటూ వైఎస్ఆర్ సీపీ నేతలపై కేసులు పెట్టడం తీవ్ర వేదనకు గురి చేసిందని జానీ వెల్లడించారు. జమ్మలమడుగు మున్సిపల్ ఛైర్మన్ పదవికి ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో తనను ఇంత వరకు ఏ అధికారి సంప్రదించలేదన్నారు. అధికారులు తనను సంప్రదించి ఉంటే కిడ్నాప్ జరగలేదని సదరు అధికారులకు వెల్లడించేవాడినని చెప్పారు. తన కుటుంబ సభ్యులను సంప్రదించిన కనీసం తాను కిడ్నాప్ కాలేదని చెప్పేవారని జానీ వివరించారు. అయితే తాను ప్రస్తుతం ఎక్కడ ఉన్నది చెప్పేందుకు జానీ నిరాకరించారు. -
ఆయుధాలతో బెదిరించి కౌన్సిలర్ కిడ్నాప్
ఆర్మూర్: నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మున్సిపల్ 20వ వార్డు టీఆర్ఎస్ కౌన్సిలర్ సుంకరి శంకర్ శనివారం అర్ధరాత్రి కిడ్నాప్‌కు గురయ్యారు. కాంగ్రెస్ నాయకులు మాజీ మావోయిస్టులతో కలిసి కిడ్నాప్ చేసినట్లు టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చైర్ పర్సన్ అభ్యర్థి అయిన బొగడమీది శ్రీదేవి భర్త అయిన కాంగ్రెస్ నాయకుడు ఏబీ శ్రీనివాస్ (చిన్న), కాంగ్రెస్ నాయులు మహేందర్, ఫత్తేపూర్ అశోక్ రెడ్డి, మాజీ మావోయిస్టు పచ్చలనడ్కుడ అన్వేష్, బట్టు శంకర్, సుంకెట చిన్న గంగారాం, అమర్ భూషణ్‌లు ఆయుధాలతో బెదిరించి తన భర్తను కిడ్నాప్ చేసినట్లు శంకర్ భార్య సుంకరి స్వప్న ఆర్మూర్ డీఎస్పీ ఆకుల రాంరెడ్డికి ఆదివారం ఫిర్యాదు చేసారు. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఈ విషయాన్ని రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డికి చేరవేయడంతో ఆయన ఈ విషయమై సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం.