అందం అంటే ముచ్చుమర్రి గిత్తదే
అందం అంటే ముచ్చుమర్రి గిత్తదే
- షో ఆఫ్ ది చాంపియన్‌గా ఎంపిక
- ముగిసిన ఒంగోలు గిత్తలు, ఆవుల అందాల పోటీలు
నెల్లూరు రూరల్ : సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని పూండ్ల వెంకురెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నాలుగురోజులపాటు నెల్లూరు కనుపర్తిపాడులో నిర్వహించిన అఖిల భారత ఒంగోలు జాతి ఆవులు, గిత్తల అందాల ప్రదర్శనలు, బండ లాగుడు పోటీలు శుక్రవారంతో ముగిశాయి. గిత్తల అందాల పోటీల్లో మన జిల్లాలోని ముచ్చుమర్రి గ్రామానికి చెందిన కాటం మురళీధర్‌రెడ్డి గిత్త షో ఆఫ్ ది ఛాంపియన్‌గా నిలిచి ఒంగోలు జాతి రాజసాన్ని చాటింది. గత ఏడాది నిర్వహించిన పోటీల్లో కూడా ఛాంపియన్‌గా నిలవడం విశేషం. ఆవుల విభాగంలో క్వీన్ ఆఫ్ ది షోగా ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన పమిడి రాజశేఖర్ పాడి ఆవు ఎంపికైంది. వీరికి ప్రత్యేకంగా కిలో వెండిని బహుమతిగా అందజేశారు.