కరీంనగర్లో పోలీసుల కార్డన్ సెర్చ్
కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రంలో పోలీసులు కార్డన్ సెర్చ్ చేపట్టారు. మంగళవారం వేకువజామున నుంచి 7.30 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. సీపీ కమలాసన్‌రెడ్డి నేతృత్వంలో 50 మంది పోలీసులు జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో ఇల్లిల్లూ సోదా జరిపారు.
ఈ సందర్భంగా 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేని 20 బైకులు, 2 కార్లు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కా క్వింటాలు సీజ్ చేశారు. సోదాల్లో ఏసీపీ రామారావు, సీఐలు హరిప్రసాద్, శ్రీనివాస్‌రెడ్డి, సదానందం పాల్గొన్నారు.