మునక్కాయతో రక్తశుద్ధి!
కాయ ‘ఫలాలు’
మునక్కాయలో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. మునక్కాయ తింటే ఎముకలు గట్టిపడతాయి, రక్తం శుద్ధి అవుతుంది. గర్భిణి మునక్కాయ తింటే ప్రసవానికి ముందు, ప్రసవం తర్వాత ఎదురయ్యే అనేక సమస్యలు నివారణ అవుతాయి.
ఛాతీ పట్టేయడం, గొంతు నొప్పి వంటి సమస్యలకు మునక్కాయ సూప్ తాగడం చక్కటి పరిష్కారం.
ఆస్థమా, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతుంటే మరుగుతున్న నీటిలో మునక్కాయ ముక్కలు వేసి, ఆ ఆవిరి పడితే ఉపశమనం కలుగుతుంది.
మునక్కాయ రసం సౌందర్యపోషణకు కూడా ఉపయోగపడుతుంది. మునగ రసంలో నిమ్మరసం కలిపి ముఖానికి రాస్తే ముఖం కాంతిమంతమవుతుంది.
- ఉషశ్రీ, కేర్ హాస్పిటల్