కొనసాగుతున్న రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు
కరీంనగర్ స్పోర్ట్స్ : సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకుని నాలుగు రోజులుగా జిల్లా కేంద్రంలోని జ్యోతి బాపూలే మైదానంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. శుక్రవారం నాటి మ్యాచ్‌ల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్, కార్పొరేటర్ మాచర్ల రజిత, బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బుర్ర హరికుమార్ హాజరయ్యారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గణగాని సత్యనారాయణ గౌడ్, మూల శ్రీనివాస్‌గౌడ్, పల్లె నారాయణగౌడ్ పాల్గొన్నారు.