ఎంసీసీ 231 ఆలౌట్
సాక్షి, హైదరాబాద్: ఎలిగెంట్ సీసీ బౌలర్ అశ్విన్ విజయ్ (6/44) చెలరేగడంతో ఎ డివిజన్ రెండు రోజుల లీగ్‌లో ఎంసీసీ జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎంసీసీ జట్టు 74.5 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది. సంతోష్ (80 బంతుల్లో 81; 11 ఫోర్లు), ముకుంద్ (139 బంతుల్లో 50; 4 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించారు. ఎలిగెంట్ సీసీ బౌలర్లలో నిహాల్ 3 వికెట్లు, నితీష్ కుమార్ ఒక వికెట్ పడగొట్టారు.
ఎ-డివిజన్ వన్డే లీగ్ మ్యాచ్‌లో వెంకట చైతన్య (7/12) చెలరేగడంతో కన్సల్ట్ సీసీ 106 పరుగుల తేడాతో సఫిల్‌గూడ సీసీపై ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కన్సల్ట్ సీసీ 48.2 ఓవర్లలో 158 పరుగులు చేసి ఆలౌటైంది. నజీర్ 37, చెన్నారావు 33 పరుగు లు చేయగా... ప్రత్యర్థి బౌలర్లలో నిశాంత్ 4, కార్తీక్, జయంత్ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన సఫిల్‌గూడ సీసీ 21.2 ఓవర్లలో 52 పరుగులకే కుప్పకూలింది. హర్ష (20) మినహా ఇంకెవరూ రెండంకెల స్కోర్లు చేయలేదు. వెంకట చైతన్య చక్కని స్పెల్ (8.2-3-12-7)తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను వణికించాడు. భవన్ రెడ్డికి 3 వికెట్లు దక్కాయి.