పేలిన కారు బాంబులు : 10 మంది మృతి
బాగ్దాద్: కారు బాంబుల పేలుళ్లతో బాగ్దాద్ నగరం గురువారం అర్థరాత్రి దద్దరిల్లింది.ఈ పేలుళ్లలో 10 మంది మరణించగా... 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి... చికిత్స అందిస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. మధ్య బాగ్దాద్‌లోని బాబ్లీ హోటల్ సమీపంలో మొట్టమొదటగా కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 14 మంది గాయపడ్డారు.
ఆ తర్వాత ఐదు నిముషాల తేడాతో క్రిస్టల్ హోటల్ సమీపంలో మరో కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. మరో 13 మంది గాయపడ్డారు. గత కొనేళ్లుగా జరుగుతున్న విధ్వంసంతో ఇరాక్ దద్దరిల్లుతున్న విషయం విదితమే. ఈ విధ్వంసంలో ఏ ఏడాది మొదటి నుంచి ఇప్పటి వరకు 5,576 మంది పౌరులు మరణించగా, 11,666 మంది మరణించారని యూఎన్ నివేదికలో వెళ్లడించిన సంగతి తెలిసిందే.