3.5 కోట్ల నగదు, రూ.కోటి మద్యం స్వాధీనం
పుదుచ్చేరి: కేరళ ఎన్నికల సమయంలో అక్కడ మద్యం ఏరులై పారుతోంది. ఇప్పటివరకూ అక్కడ రూ.కోటి విలువైన మద్యం సీజ్ చేసినట్లు ఎక్సైజ్ శాఖ, ఎన్నికల కమిషన్ అధికారులు వెల్లడించారు. పర్మిషన్ లేకుండా మద్యం అమ్మకాలు, అక్రమంగా నిల్వ ఉంచిన వారిపై కేసులు నమోదు చేశామని, తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి పీ జవహార్ తెలిపారు. 116 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నట్లు గుర్తించారు.
రూ.3.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వాహనాలలో తరలిస్తుండగా, ఇళ్లు, దుకాణాలలో ఎలాంటి రశీదు, ఆధారాలు లేకుండా కలిగిఉన్న సొమ్మును సీజ్ చేసి వెరిఫికేషన్ చేస్తున్నారు. 9258 మంది ఉద్యోగులలో 5110 మంది ఓటింగ్ లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, బుధవారం మిగతా ఉద్యోగులు ఓటేస్తారని అధికారులు వివరించారు. ఈ నెల 16న పోలింగ్ జరగనుండగా, 19న ఫలితాలు వెలువడతాయి. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగలేదని డీఈవో చెప్పారు.