బజాజ్ ‘సీటీ 100’ సరికొత్తగా లాంచ్
బజాజ్ ఆటో తన పాపులర్ బైక్ సీటీ 100 లో అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. ఎలక్ట్రిక్ స్టార్ట్ తో ఆధునీకరించిన సీటీ 100 అల్లాయ్ ఈఎస్‌ను బుధవారం ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది.దీని ధరను రూ.38,806 గా నిర్ణయించింది.
విశ్వసనీయత, నాణ్యత మరియు సుపీరియర్ ఇంధన సామర్థ్యంతో కస్టమర్లకు 'జాక్‌పాట్' గా ప్రసిద్ధి చెందిన సీటీ 100 న్యూ లుక్‌తో లాంచ్ చేసింది. పరిమితం కాలానికి దేశవ్యాప్తంగా అన్ని అధికారం బజాజ్ ఆటో డీలర్‌షిప్‌ల వద్ద అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక ప్రకనటలో తెలిపింది.
ఇక ఫీచర్ల విషయానికి వస్తే..వినూత్నమైన స్ప్రింగ్ సస్పెన్షన్ స్ప్రింగ్ టెక్నాలజీ , విప్లవాత్మకమైన 103 సీసీ సింగిల్ ఇంజీన్, 4-స్ట్రోక్ పెట్రోల్ మోటార్, 7.7 పీఎస్ పవర్, 8.24ఎన్ఎం టార్క్ తదితర ఫీచర్స్‌తో ఒక ఆకర్షణీయమైన కొత్త డెకాల్ డిజైన్‌తో రూపొందించింది. అలాగే ఫ్యూయల్ గేజ్ , ఫెక్సిబుల్ సైడ్ ఇండికేటర్స్‌ను అమర్చింది. మూడు రంగుల ఆప్షన్స్‌లో ఇంది అందుబాటులో ఉంటుంది.
ఎలక్ట్రిక్ స్టార్ట్ సౌలభ్యంతో ఇది వినియోగదారులకి గొప్ప మైలేజిని అందిస్తుందని బజాజ్ ఆటో లిమిటెడ్ అధ్యక్షుడు మోటార్ ఎరిక్ వాస్ తెలిపారు. రూ.38,806 ఆరంభ ధరలో సీటీ 100 ఎలెక్ట్రిక్ స్టార్ట్ వెర్షన్, ఎంట్రీ లెవల్ 100 సీసీ కమ్యూటర్ సెగ్మెంట్లో కస్టమర్ల సంఖ్యను పెంచుకోవాలనిచూస్తున్నామన్నారు.