కిట్స్‌లో హంగామా
‘ఇటు రాయే.. ఇటు రాయే.. నీ మీదే మనసాయే’.. ‘బంగారు కోడిపెట్ట వచ్చేనండి.. యే పాప.. యే పాప.. యే పాపా’.. అంటూ సినీగాయకుడు హరిచరణ్ పాడిన పాటలు విద్యార్థులను హుషారెత్తించాయి.
నగర శివారులోని కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న కల్చరల్ కార్నివాల్ సంస్కృతి-14 ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మ్యూజికల్ నైట్‌లో హరిచరణ్ స్టెప్పులు వేస్తూ పాడిన పాటలకు విద్యార్థులు కోరస్ కలిపారు. కాగా, మరో సినీ నేపథ్య గాయని భార్గవి పిళ్లై ‘మైనేమ్ ఈజ్ షీలా.. షీలాకి జవానీ’.. ‘ఆకలేస్తే అన్నం పెడుతా... అలిసొస్తే ఆయిల్ పెడుతా’ అంటూ పాటలు పాడడంతో విద్యార్థులు కేరింతలు కొట్టారు.
ఇదిలా ఉండగా, కళాశాలకు చెందిన బీటెక్ ఫస్టియర్ విద్యార్థి చైతన్య తాను సొంతంగా రాసిన ‘అమ్మ.. నాన్న నీకు వందనం పాట ఆహూతులను ఆకట్టుకుంది. అనంతరం విద్యార్థులు ఫ్యాషన్‌షో, ఫేస్ పెయిటింగ్, సోలో సాంగ్స్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ అశోక్‌రెడ్డి, డాక్టర్ కె. శ్రీధర్, ప్రోగ్రాం కన్వీనర్ డాక్టర్ ఎం.నర్సింహరావు పాల్గొన్నారు. - భీమారం