నిలకడగా గోదావరి వరద
2,45,090 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి..
పశ్చిమ డెల్టాకు నీటి విడుదల కుదింపు
కొవ్వూరు: గోదావరిలో వరద నిలకడగా కొనసాగుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద మంగళవారం సాయంత్రం 10.80 అడుగులు నమోదైంది. ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు నీటి విడుదల తగ్గించారు. సోమవారం 10,400 క్యూసెక్కులు విడిచిపెట్టగా మంగళవారం 9,200 క్యూసెక్కులకు కుదించారు. తూర్పుడెల్టాకు 4,100, సెంట్రల్ డెల్టాకు 2,100, పశ్చిమ డెల్టాకు 3 వేల క్యూసెక్కులు చొప్పున సాగునీరు అందిస్తున్నారు. మిగిలిన 2,45,090 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెడుతున్నారు.
పశ్చిమ డెల్టాకు 3 వేల క్యూసెక్కులు
పశ్చిమ డెల్టాకు నీటి విడుదలను అధికారులు కుందించారు. మంగళవారం సాయంత్రం నుంచి 3 వేల క్యూసెక్కులు నీరు వదులుతున్నారు. జీ అండ్ వీ కెనాల్‌కి 489, నరసాపురం కాలువకి 1,534, ఉండి కాలువకి 997, ఏలూరు కెనాల్‌కి 693, అత్తిలి కాలువకి 267 క్యూసెక్కులు చొప్పున సాగునీరు విడుదల చేస్తున్నారు.