‘కస్టమర్ హైరింగ్ సెంటర్లకు నిధులు పుష్కలం’
నూజివీడు రూరల్, న్యూస్‌లైన్ : కస్టమర్ హైరింగ్ సెంటర్ల స్థాపనకు నిధులు పుష్కలంగా ఉన్నాయని వ్యవసాయాశాఖ జాయింట్ డెరైక్టర్ ఎన్సీహెచ్.బాలునాయక్ తెలిపారు. పట్టణ పరిధిలోని గొడుగువారిగూడెంలో నిర్వహిస్తున్న కస్టమర్హైరింగ్ సెంటర్ (రైతులకు యంత్రాలను అద్దెకిచ్చు కేంద్రం) ను శనివారం ఆయన పరిశీలించారు. జిల్లాలో కస్టమర్ హైరింగ్ సెంటర్ల నిర్వహణ కేంద్రాల స్థాపనకు, గ్రూప్రైతులకు అందించేందుకు రూ 9.55 కోట్ల యాంత్రీకరణ రుణాలు మంజూరయ్యాయని తెలిపారు. కేంద్రాలు స్థాపించేందుకు ఆసక్తి ఉన్న రైతులు గ్రూపులుగా ఏర్పడి దరఖాస్తు చేసుకున్నట్లైతే తక్షణమే రుణం, సబ్సీడి మంజూరు చేస్తారని చెప్పారు. జిల్లాలో పత్తి యంత్రాలు 20, మొక్కజొన్న 10, పోగాకు 05, వేరుశనగ 04, వరినాటే యంత్రాలు 4 ప్రభుత్వం పంపిణీ చేసిందన్నారు. 43 యంత్రాలకు గానూ ప్రస్తుతానికి 10 యంత్రాలను రైతులకు అందించామని చెప్పారు. వ్యవసాయశాఖ డెప్యూటీ డెరైక్టర్ వెంకటేశ్వరరావు ఏడీ విజయకుమారి, ఏవో జే భవాని తదితరులు పాల్గొన్నారు.