Cut-outs
-
‘విజయవాడ టీడీపీ నాయకుల సొత్తా?’
సాక్షి, విజయవాడ: నగరంలో రాజకీయ పార్టీల కటౌట్ల ఏర్పాటుకు సంబంధించిన అనుమతుల విషయంలో అధికారులు ఏకపక్షంగా వ్యవహరించడంపై జనసేన పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి నిరసనగా ఆ పార్టీ నాయకులు మంగళవారం నగర మేయర్ కోనేరు శ్రీధర్ చాంబర్ ముందు ధర్నాకు దిగారు. అధికారులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నగరంలో టీడీపీ కటౌట్లు తప్ప ఇతర పార్టీలకు చెందిన కటౌట్లను పెట్టనియడం లేదని ఆరోపించారు. ఒకవేళ కటౌట్లు పెట్టినప్పటికీ.. 24 గంటలలోపే తొలగిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలకు చెందిన కటౌట్లకు అనుమతి లేకపోయిన వాటిని నెలల తరబడి చూసిచూడనట్టు వదిలేస్తున్నారని తెలిపారు. విజయవాడ టీడీపీ నాయకుల సొత్తు అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. నగరంపై అన్ని పార్టీలకు సమాన హక్కు ఉందన్నారు. -
'మీరు చెప్పేది నమ్మశక్యంగా లేదు'
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హోర్డింగ్స్, బ్యానర్లు, కటౌట్ల ఏర్పాటుపై హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. అనుమతులు లేకుండా వెలసిన బ్యానర్లు, హోర్డింగ్స్, కటౌట్లను తక్షణమే తొలగించాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. అక్రమ హోర్డింగ్‌లపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఎలాంటి అక్రమ హోర్డింగ్స్ లేవని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. 'మీరు చెప్పేది నమ్మశక్యంగా లేదు. అనుమతులు లేకుండా వెలసిన హోర్డింగ్స్‌పై జన్మదిన శుభాకాంక్షలా?. దీనిపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వండి' అని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను రెండువారాలకు వాయిదా వేసింది. కాగా రాజకీయ పక్షాలు తమ పార్టీల నాయకులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆహ్వానాలు పలుకుతూ ఇష్టారాజ్యంగా ఎక్కడ బడితే అక్కడ బ్యానర్లు, హోర్డింగ్స్ ఏర్పాటు చేసేస్తున్న విషయం తెలిసిందే. -
హోర్డింగ్స్, బ్యానర్లు, కటౌట్లు పీకిపారేయండి
-
హోర్డింగ్స్, బ్యానర్లు, కటౌట్లు పీకిపారేయండి
హైదరాబాద్ : హోర్డింగ్స్, బ్యానర్లు, కటౌట్ల ఏర్పాటుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అనుమతులు లేకుండా వెలసిన బ్యానర్లు, హోర్డింగ్స్, కటౌట్లను తక్షణమే తొలగించాల్సిందేనని న్యాయస్థానం శుక్రవారం స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాల డీజీపీలు, కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్ అధికారులను ఆదేశించింది. బహిరంగ ప్రదేశాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు పెట్టడం వల్ల ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారని, ప్రభుత్వం జీవో జారీ చేసినా వాటిని అమలు చేయడం లేదంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. న్యాయవాది ఎంఎస్ఎన్ ప్రసాద్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు ..ఈ మేరకు ఆదేశాలు ఇస్తూ విచారణను జనవరి చివరి వారానికి వాయిదా వేసింది. అలాగే ఏపీ, తెలంగాణలో ఏర్పాటు చేసిన విగ్రహాలపై సమీక్ష జరిపి నిర్ణయాలు తీసుకోవాలని రెండు రాష్ట్రాలకు హైకోర్టు ఆదేశించింది. రాజకీయ పక్షాలు తమ పార్టీల నాయకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆహ్వానాలు పలుకుతూ ఇష్టారాజ్యంగా ఎక్కడ బడితే అక్కడ బ్యానర్లు, హోర్డింగ్స్ ఏర్పాటు చేసేస్తున్న విషయం తెలిసిందే.