'55 యాంటీ చైన్ స్నాచర్ టీంల ఏర్పాటు'
హైదరాబాద్: సైబరాబాద్ పరిధిలో 55 యాంటీ చైన్ స్నాచర్ల టీంలు ఏర్పాటు చేసినట్టు సైబరాబాద్ కమిషనర్ సీపీ ఆనంద్ పేర్కొన్నారు. ఆటోనగర్‌లో చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డ ముఠా కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.
బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆటోనగర్ దాడిలో ఒకరికి బుల్లెట్ గాయమైనట్టు అనుమానిస్తున్నామన్నారు. తమ సిబ్బందికి ట్రైనింగ్, ఫైరింగ్‌లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. త్వరలోనే చైన్ స్నాచర్లను పట్టుకుంటామని సీపీ ఆనంద్ వెల్లడించారు.