సైకిల్ హెరిటేజ్ క్విజ్
భారతదేశ సంస్కృతి, సంప్రదాయం, వారసత్వసంపదపై అగర్బత్తీల కంపెనీ సైకిల్ బ్రాండ్ ఈ రోజు వినూత్న క్విజ్ నిర్వహించనుంది. ఎనిమిది, తొమ్మిదో తరగతి విద్యార్థులను ఈ పోటీకి ఆహ్వానిస్తోంది. గ్లోబలైజేషన్లో సంప్రదాయ గీతలు చెరిగిపోతున్న వేళ.. మన సంస్కృతిని చాటి చెప్పడానికి ఈ క్విజ్ నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. శ్రీనగర్‌కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగమంలో ఈ పోటీ జరగనుంది.