విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని సైకిల్‌యాత్ర
ఎల్కతుర్తి: విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నాయకులు చేపట్టిన సైకిల్ యాత్ర శుక్రవారం మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మాదం తిరుపతి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసి, కేజీ టూ పీజీ ఉచిత విద్యను అమలు చేయాలన్నారు. పెరిగిన ధరలకు అనుకూలంగా మెస్, కాస్మోటిక్ చార్జీలను పెంచాలన్నారు. జిల్లా వ్యాప్తంగా వంట గదులు లేని పాఠశాలల్లో వెంటనే వంట గదులు ఏర్పాటు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యూలర్ చేసి కస్తూర్బా పాఠశాలల సమస్యల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈనెల 27న కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని తెలిపారు. ఈ యాత్రలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు, బాశబోయిన సంతోష్, నాయకులు రాజు, ప్రవీన్, చిరంజీవి, శ్రీనివాస్ పాల్గొన్నారు.