cyclonic Storm Kyant
-
తమిళనాడులో భారీ వర్షాలు .. ఐఎమ్‌డీ హెచ్చరిక
చెన్నై: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడులో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. డిసెంబర్ 1 నుంచి 4 మధ్య తమిళనాడు తీరప్రాంతంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎమ్‌డీ వెల్లడించింది. చెన్నైతోపాటు తమిళనాడులోని మరో ఐదు జిల్లాల్లో శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. చెంగల్పట్టు, తిరువళ్లూరు, నాగపట్నం, రామనాథపురం, కాంచీపురం వర్ష ప్రభావిత జోన్లో ఉన్నట్లు పేర్కొంది. గత కొద్ది రోజులుగా తమిళనాడును భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. గురువారం కూడా చెన్నై చుట్టుపక్కల జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాఠశాలలకు సెలవులు కూడా ప్రకటించారు. చెంబరంబాక్కం సరస్సు నుంచి నీటిని విడుదల చేయడంతో కాంచీపురం జిల్లాలోని అడయార్ నది ఒడ్డున ఉన్న లోతట్టు ప్రాంతాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురువారం వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సందర్శించారు. చెన్నైలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాట్లను సమీక్షించారు. అత్యవసర సేవల కోసం చెన్నై కార్పొరేషన్ ఎమర్జెన్సీ నెంబర్ 1913 నెంబర్‌కు సమాచారం అందించాలి కోరారు. ఫిర్యాదులను ఆలస్యం చేయకుండా పరిష్కరించడానికి శాఖల మధ్య మెరుగైన సమన్వయం ఏర్పర్చుకోవాలని కోరారు. ఇదీ చదవండి: AIIMS Rishikesh: ఎయిమ్స్ నుంచి కార్మికులు డిశార్జ్ -
‘అధికారులు అప్రమత్తంగా ఉండాలి’
విజయనగరం: పెను తుపాను ముప్పు పొంచి ఉండటంతో.. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని విజయనగరం జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ సూచించారు. సముద్ర తీర ప్రాంతంలోని పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లోని 26 గ్రామాలకు చెందిన మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దంటూ ఆదేశాలు జారీచేశారు. తీర ప్రాంత మండల కేంద్రాల్లో ఆర్డీవోలను ప్రత్యేక అధికారులుగా నియమించారు. -
దీపావళి రోజు తీరం దాటనున్న 'క్యాంట్'!
విశాఖ: బంగాళాఖాతంలో ఏర్పడ్డ క్యాంట్ తుపాను దీపావళి రోజున తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు దిశగా కదులుతున్న ఈ తుపాను...చెన్నై- మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఈ తుపాను విశాఖకు తూర్పు ఆగ్నేయంగా 570 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, పశ్చిమ బంగాళాఖలంలోకి రేపు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో కోస్తా తీరం వెంబడి ఉత్తర దిశగా గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. మరోవైపు క్యాంట్ తుపానుపై విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ బుధవారం సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 11 తీరప్రాంత మండలాలను అప్రమత్తం చేశామని, కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తామన్నారు. కలెక్టరేట్లో 180042500009 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందం విశాఖ చేరుకుందని, అలాగే 20 బోట్లు, రెస్క్యూ టీమ్‌లు ఏర్పాటు చేయాలని నేవీని కోరినట్లు చెప్పారు. పారాదీప్ వద్ద చిక్కుకున్న 60-70 బోట్లకు అక్కడే లంగర్ వేసే అవకాశం కల్పించాలని, పారదీప్ అధికారులను కోరుతున్నామన్నారు. అలాగే తుపాను దృష్ట్యా అధికారులకు సెలవులు రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. -
ఏపీకి పొంచి ఉన్న ‘క్యాంట్’ ముప్పు
విశాఖపట్నం: నడిసంద్రంలో ఇంతవరకూ ఊగిసలాడిన క్యాంట్ తుపాను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వైపే దూసుకొస్తోంది. తొలుత పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల వైపు వెళ్తుందనుకున్న ఈ తుపాను చివరకు దిశ మార్చుకుంది. ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం ఈ నెల 27 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మంగళవారం మధ్యాహ్నానికి తుపానుగా బలపడింది. ఇది ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు తూర్పు ఆగ్నేయంగా 600, విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 705, మచిలీపట్నానికి తూర్పు ఈశాన్య దిశలో వెయ్యి కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. క్యాంట్‌గా నామకరణం చేసిన ఈ తుపాను గంటకు 9 కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా పయనిస్తోంది. ఇది బుధవారం నాటికి ఒకింత బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేస్తోంది. రాగల 36 గంటల్లో తుపాను మరింత బలపడనుంది. పశ్చిమ దిశగా పయనిస్తూ రేపు పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. రేపటి నుంచి ఏపీ, ఒడిశాలో తుపాను ప్రభావం ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు ఈ నెల 27 నుంచి రాష్ట్రంలో తుపాను ప్రభావం స్పష్టంగా కనిపించనుంది. 28, 29 తేదీల్లో కోస్తాంధ్రలో పలుచోట్ల మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవవచ్చని పేర్కొంది. అదే సమయంలో ఈ నెల 27 నుంచి కోస్తాంధ్రలో తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అలాగే మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది. కాగా తుపానుకు ‘క్యాంట్’ అనే పేరును మయన్మార్ సూచించింది.