ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల కొరతపై దృష్టి
భీమడోలు, న్యూస్‌లైన్ :
జిల్లాలోని సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల కొరత ఉందని, సమస్యపై దృష్టి సారిస్తామని వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ సంచాలకులు(రాజమండ్రి) డాక్టర్ డి.షాలినిదేవి అన్నారు. స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని గురువార ం జిల్లా ైవె ద్య ఆరోగ్యశాఖాధికారిణి టి.శకుంతల కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. సీనియర్ పబ్లిక్ హెల్త్ అధికారిణి ఆస్పత్రిలో లేకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో పలు విభాగాలు, రికార్డులను పరిశీలించారు. వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డీ షాలినిదేవి మాట్లాడుతూ సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో గైనకాలజిస్ట్, మత్తు వైద్యుడు, పిల్లల వైద్యులు అవసరమని, అయితే జిల్లాలో పూర్తిస్థాయిలో ఏ సీహెచ్‌సీలో ఆ ముగ్గురు వైద్యులు లేరన్నారు. సమస్యను అధిగమించేందుకు శ్రద్ధ వహిస్తామన్నారు.
జననీ సురక్ష యోజన పథకం లబ్ధికి ఆధార్ సీడింగ్ తప్పనిసరన్నారు. డీఎంహెచ్‌వో శకుంతల మాట్లాడుతూ మాతా శిశు మరణాలను తగ్గించేందుకు ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద జిల్లాలో ప్రతి ఏటా సబ్ సెంటర్‌కు రూ.10 వేలు అందించే వారమని, ప్రస్తుతం రూ. 7500లు తొలి విడతగా అందించినట్లు తెలిపారు. జిల్లాలో 73 పీహెచ్‌సీలు ఉండగా కొత్తగా మార్టేరులో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. జిల్లాలో 25 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీని ఉపాధి కల్పనాధికారి కార్యాలయానికి అప్పగించినట్లు చెప్పారు. సర్టిఫికెట్ల పరిశీలన ఈనెల 13న చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో 19 కాంట్రాక్ట్ వైద్యుల పోస్టుల్లో ఐదుగురిని నియమించినట్లు చెప్పారు. అనాసక్తి కనబర్చిన 14 మందిని బ్లాక్ లిస్ట్‌లో ఉంచామన్నారు. వైద్యులు క్రాంతిభూపతి, భరత్, శాంతికమల, సిబ్బంది పాల్గొన్నారు.
వేతనాలు ఆన్లైన్లో చెల్లించండి
ఏలూరు అర్బన్, న్యూస్‌లైన్ : ఆశ కార్యకర్తలకు వేతనాల చెల్లింపులో ఆలస్యానికి తావు లేకుండా ఇకపై ఆన్లైన్ ద్వారా చెల్లించాలని రీజినల్ డెరైక్టర్ డాక్టర్ షాలినిదేవి జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులకు ఆదేశాలిచ్చారు. గురువారం డీఎంహెచ్‌వో కార్యాలంయలో జరిగిన ఆశ నోడల్ ప్రతినిధుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆశ కార్యకర్తల సేవలు పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడంలో భాగంగా వారి ద్వారా ఆసుపత్రుల్లో ప్రసవాలపై గ్రామీణ మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. డీఎంహెచ్‌వో డాక్టర్ శకుంతల మాట్లాడుతూ ఈనెల 19న పల్స్‌పోలియో కార్యక్రమం విజయవంతానికి ఆశ కార్యకర్తలు కృషి చేయూలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఆరోగ్య విస్తరణాధికారి సీహెచ్ నాగేశ్వరరావు, అధికారులు నాగమణి, లిడియా పాల్గొన్నారు.